తెలంగాణ కరోనా అప్డేట్.. ఈరోజు ఎన్నంటే ?
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత తగ్గుతున్న సంగతి తెలిసిందే. కొత్త కేసులు రోజుకు 200 లోపే నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,712కి చేరింది. ఇందులో 2,94,386 మంది డిశ్చార్జ్ కాగా, 1625 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో తాజాగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1625కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)