ఢిల్లీలో రైతుల పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు..

ఢిల్లీలో రైతుల పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశరాజధాని ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు రైతులు.. దీంతో, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బీజేపీ అగ్రనేతలు నిన్న రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన.. రైతుల ఆందోళనపై చర్చించారు అంటే.. పోరాటం ఎంత సీరియస్‌గా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఢిల్లీ కేంద్రంగా .. వ్యవసాయ వ్యతిరేక బిల్లులపై రైతులు పోరాటం చేస్తున్నారు.. వారి పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. రైతులపై చేసిన లాఠీచార్జిను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించిన ఆయన.. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు.. మరోవైపు.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెప్పారని రైతులు సన్నాలు వేశారు.. కానీ, ఈ రోజు కొనే పరిస్థితి లేదని మండిపడ్డారు. ప్రతీ గింజను కొనే వరకు ప్రభుత్వంపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తుందని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్.. 

ఇక, గ్రేటర్ ఎన్నికల సమయంలో మరోసారి హైదరాబాద్‌లో రోహింగ్యాల వ్యవహారం తెరపైకి రాగా.. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లెటర్ రాస్తే చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెబుతున్నారు.. మరి ఆ మాటలు దేనికి సంకేతం అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్.. మీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చెస్తామంటూన్నారు.. అని గుర్తుచేసిన ఆయన.. మరోవైపు.. ప్రతీ రాజకీయ పార్టీ నేతలపై కేంద్ర సంస్థలు రైడ్స్ చేస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.