వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌తో సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

వ్య‌వ‌సాయ‌శాఖ అధికారుల‌తో సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

మార్కెట్లో సరైన ధరలు లభించే అవకాశం ఉన్న పంటల రకాలను ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదే అన్నారు సీఎం కేసీఆర్.. తమ ఇష్టానుసారం కాకుండా అన్ని జిల్లాల అధికారులు తమ ఉన్నతాధికారులనుంచి వచ్చిన ఆదేశాల మేరకే కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు.  ప్రగతి భవన్ లో ఇవాళ‌ జరిగిన అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు సీఎ కేసీఆర్.. రైతు సంక్షేమం దృష్ట్యా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఆలోచనా ధృక్పథాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాల‌ని సూచించారు. తెలంగాణ సాగు బాగు కోసం వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి కుటుంబంలా సమన్వయంతో పనిచేయాలన్నారు. 

మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర రావట్లేదని, క్వింటాలుకు ఎనిమిది, తొమ్మిది వందల రూపాయలకు మించి ధర పలకడం కష్టసాధ్యమైన నేపథ్యంలో అదే ధరకు అమ్ముకోదలచిన రైతులు మాత్రమే మక్కపంట వేసుకోవాలనే విషయాన్ని మరింతగా అర్థం చేయించాలని సీఎం కెసిఆర్ మరో మారు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యవసాయం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నది. వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని రకాల వ్యవస్థలు అందుకనుగుణంగా సమన్వయంతో పనిచేయాల్సి వున్నది. ప్రభుత్వ సూచనలను గౌరవించి నియంత్రిత వ్యవసాయానికి రైతులు అలువాటు పడుతున్నరు.  వారికి ఏ పంటవేయాలి ఎట్లా దిగుబడిని పెంచాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు వివరించాల్సిన బాద్యత వ్యవసాయ శాఖదే అని స్ప‌ష్టం చేశారు. అధిక దిగుబడులతో పంటలు పండిచడమే కాదు, రైతులు పండించిన పంటకు మంచి ధర వచ్చేందుకు ఎటువంటి మార్కెటింగ్ పద్ధతులను అవలంభించాలో, అందుకు తగ్గట్టు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసుకోవాల‌ని వివరించారు సీఎం కేసీఆర్.