ఆధ్యాత్మికతతో పాటు... ఆహ్లదం ఉట్టిపడేలా యాదాద్రి...

ఆధ్యాత్మికతతో పాటు... ఆహ్లదం ఉట్టిపడేలా యాదాద్రి...

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామీ ఆలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.  నిర్మాణం పనులను పర్యవేక్షించేందుకు ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి వెళ్లారు.  ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.  వందల సంవత్సరాలపాటు మనుగడలో ఉండాలని, తొందరపడకుండా, ఇలాంటి తప్పులు జరగకుండా సంప్రదాయాల ప్రకారం, ఆగమశాస్త్రాల నియమం ప్రకారం ఆలయ నిర్మాణం పనులు జరిగేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.  ఆధ్యాత్మికతతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆహ్లదం ఉట్టిపడేలా నిర్మాణం ఉండాలని, ఆలయం చుట్టుపక్కల పరిసరాలు పచ్చదనంతో నిండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.  ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా నిర్మాణం ఉండాలని, 5 వేల కార్లు, 10వేలకు పైగా ద్విచక్రవాహనాలు నిలిపేంత పెద్దగా పార్కింగ్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.