రైతన్న వంద శాతం రైతుబంధుసాయం పొందాలి-కేసీఆర్

రైతన్న వంద శాతం రైతుబంధుసాయం పొందాలి-కేసీఆర్

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగిన నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారని వెల్లడించారు. ఏ పంట వేయడం ద్వారా మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగు చేస్తే రైతుకు ఏ ఇబ్బంది ఉండదన్నారు ముఖ్యమంత్రి. విభిన్న నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు, రైతు పక్షపాత ప్రభుత్వం లాంటి అనుకూలతలను సద్వినియోగం చేసుకుని... తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప రైతాంగంగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర జీవికలో వ్యవసాయం ప్రధాన భాగం.. వ్యవసాయం భవిత ఉజ్వలంగా ఉండాలి.. తెలంగాణ రైతులు నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచానికి అందించడం ద్వారా లాభాలు గడించాలన్నారు సీఎం కేసీఆర్.