సబ్బండ వర్ణాలు సంబరపడిన రోజు జూన్‌ 2వ...నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

సబ్బండ వర్ణాలు సంబరపడిన రోజు జూన్‌ 2వ...నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది.  అయితే కరోనా కారణంగా నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు. జిల్లాలో ప్రముఖులు జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు. రాజ్ భవన్‌లో గోశాల ఏర్పాటు చేసి  గవర్నర్‌ వేడుకలు నిర్వహిస్తారు. CM KCR కాసేపట్లో అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడంతో పాటు ప్రగతి భవన్‌లో జాతీయ జండాను ఎగురవేస్తారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించాక జాతీయ పతాకావిష్కరణ వరకే కార్యక్రమాలను పరిమితం చేయనున్నారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు సీఎం. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.


కరోనా కారణంగా ఈ సారి రాజ్ భవన్‌లో దీపాలంకరణ చేయలేదు. పళ్ళ మొక్కలతో అలంకరించి గోశాలను ఏర్పాటు చేశారు.  మధ్యాహ్నం రాజ్ భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ  కార్యక్రమం కూడా కోవిడ్ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారు. తలసేమియా బాధితులను కూడా కలవనున్నారు గవర్నర్‌. తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎలాంటి ఆర్భాటాలు వద్దని సూచించింది ప్రభుత్వం.