తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు.. 24 గంటల్లో 6వేలకు చేరువలో

తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు.. 24 గంటల్లో 6వేలకు చేరువలో

తెలంగాణలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. రోజువారీ కేసులు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే నిన్నటి కంటే ఇవాళ భారీగా కేసులు పెరిగాయి.  తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 5926 కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,61, 359కి చేరింది. ఇందులో 3,16,650 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 42,853 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తెలంగాణలో కొత్తగా 18 మంది కరోనాతో మృతి చెందారు.  దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1856కి చేరింది.