తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ కానుంది... సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. ఆగస్టు 1వ తేదీతో గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోనుండడంతో... గ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి నేడు కేబినెట్ ఆమోదం తెలుపనున్నది. ఇక గ్రామానికో కార్యదర్శిని నియమించాలన్న సీఎం నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన బీసీలకు వందశాతం సబ్సిడీతో చేపట్టనున్న పథకాలు, ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానున్న కంటి పరీక్షలు, రైతు బంధు, రైతుబీమాపై కూడా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది.