నేడు తెలంగాణ కేబినెట్.. కీలకమైన అజెండా ఇదే..!

నేడు తెలంగాణ కేబినెట్.. కీలకమైన అజెండా ఇదే..!

ఒక పక్క సంక్షేమ పథకాల భారం.. మరో పక్క వేల కోట్ల అప్పులు, కేంద్రం నుంచి సాయం అందని పరిస్థితుల మధ్య మరో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ బడ్జెట్ తుది రూపుపై చర్చించేందుకు ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్ కసరత్తు పూర్తి చేయడంతో పాటు, అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించల్సిన వ్యూహం, తేవాల్సిన కీలక బిల్లులు, చేయాల్సిన తీర్మానలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం వుంది.
సీఏఏ చట్టానికి తాము వ్యతిరేకమని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేసారు. దీనిపై జీహెచ్ఎంసీ కూడా ఒక తీర్మానం చేసింది. ఇక అసెంబ్లీ కూడా ఇదే తరహాలో సీఏఏకు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసే అవకాశాలపై కూడా కేబినెట్ చర్చిస్తుంది. కేసీఆర్ ప్రతిష్మాత్మకంగా భావిస్తున్న రెవిన్యూ బిల్లును కూడా ఈ సెషన్ లోనే తెస్తామని ఎప్పటినుంచో చెప్తున్నారు. కనుక ఈ బిల్లు పై కూడా కేబినెట్ తుది చర్చ జరిపే అవకాశం వుంది. దీంతో పాటు, మున్సిపల్ చట్టం, అసెంబ్లీలో ప్రభుత్వ అనుసరించాల్సిన వ్యూహం.. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు లాంటి కీలక విషయాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.