5న తెలంగాణ కేబినెట్ భేటీ.. వీటిపైనే ఫోకస్..
ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు భేటీకానున్న కేబినెట్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. కరోనా నియంత్రణ, వైరస్ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, కొత్త సచివాలయం నిర్మాణం వంటి అంశాలతో పాటు... కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.. కొత్త సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్.. శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.. సీఎం ఛాంబర్, పేషీలు, మంత్రుల ఛాంబర్, పేషీలు, శాఖలు, సమావేశ మందిరాలు, పార్కింగ్, లాండ్స్కెప్ గార్డెన్స్, వరండాలు, వసారాల పొడవు, వెడల్పు, వివిధ అంతస్తుల ఎత్తు, లెంగ్త్, విడ్త్ ఇలా ఒక్కొక్క అంశంపై కూలంకుషంగా చర్చించారు.. కేబినెట్ భేటీలో కొత్త సచివాలయంపై మంత్రులకు వివరించనున్నారు కేసీఆర్. సచివాలయ కొత్త డిజైన్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)