ఈనెల 17న కేబినెట్ కీలక భేటీ

ఈనెల 17న కేబినెట్ కీలక భేటీ

ఈ నెల 17వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 17న సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. కాగా, ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల జరగనున్నాయి. ఇప్పటికే శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, 19న మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సిల్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రప్రభుత్వం తీసుకురానున్న కొత్త మున్సిపల్ చట్టంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. 18న కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. ఆ ప్రతులను ఎమ్మెల్యేలకు అందజేస్తారు. 19న బిల్లుకు సభ ఆమోదం తెలుపనున్నది.