రేపు కేబినెట్ భేటీ.. కొత్త చట్టంపై ఫోకస్..!

రేపు కేబినెట్ భేటీ.. కొత్త చట్టంపై ఫోకస్..!

ఆదివారం రోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది... కొత్త రెవెన్యూ చట్టం ఇక బడ్జెట్ సమావేశాలతో పాటు పలు అంశాలపై చర్చ  జరగనుంది. రేపు సాయంత్రం ఈ సమావేశం జరగనుంది. కాగా, తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చాలని, సంస్కరణలు తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ మధ్యే జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించిన సీఎం.. ఆదివారం జరిగే కేబినెట్ భేటీలో రెవెన్యూ చట్టంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక, బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.. బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా కేబినెట్‌లో ఫైనల్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. మరోవైపు హస్తిన పర్యటనకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.. రెండు, మూడు రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి... రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా ఉందంటున్నారు. దీంతో రేపు జరగనున్న కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.