పవన్ కళ్యాణ్‌తో భేటీ పై వివరణ ఇచ్చిన బండి సంజయ్...!

 పవన్ కళ్యాణ్‌తో భేటీ పై వివరణ ఇచ్చిన బండి సంజయ్...!

జనసేన అధినేత పవన కల్యాణ్‌తో భేటీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతలు స్వీకరించాక ఆయన మొదటిసారిగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. ఈ సాయంత్రానికి  భేటీకి సంబంధించిన వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే పవన్‌తో భేటీ అయ్యేది వాస్తవమేనని బండి సంజయ్ తెలిపారు. భేటీకి సంబంధించిన సమయాన్ని జనసేన వాళ్లు నిర్ణయించి చెప్తారని తెలిపారు. కాగా.. ఈరోజు సాయంత్రంలోపు పవన్‌తో భేటీ అవుతామని బండి సంజయ్ తెలిపారు.