తెలకపల్లి రవి : గ్రేటర్‌ లో లోయర్‌ పోలింగ్‌, ఎవరివిన్నింగ్‌ ? పది పాయింట్లు ?

తెలకపల్లి రవి : గ్రేటర్‌ లో లోయర్‌ పోలింగ్‌, ఎవరివిన్నింగ్‌ ? పది పాయింట్లు ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికలో ముప్పై అయిదు శాతం పైన మాత్రమే పోలింగ్‌ జరగడం అందరినీ ఆలోచనలో పెట్టింది. కొన్ని చోట్ల మరీ దారుణంగా పడిపోయింది. దీనికి కారణాలు ఏమిటి, ప్రభావమేమిటనే దానిపై రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. నగరవాసులు గ్రామసీమల్లో వలె వెల్లువలా ఓటింగుకు రారనేది తెలిసిన విషయమే అయినా ఇంత హోరోహోరీ ప్రచారం తర్వాత ఇంత తక్కువ పోలింగ్‌ వుండటం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి ఓటర్లతో పాటు పార్టీలు కూడా బాధ్యత వహించాల్సి వుంటుందనేది వాస్తవం.

  • 1. మామూుగా ఎవరినైనా గట్టిగా ఓడించాలి లేదా గెలిపించానుకుంటే ఓటర్లు పరుగులెత్తడం ఎక్కువగా వుంటుంది.అలాటి పరిస్తితి లేదనేది అందరూ చెబుతున్న మాట. అంత ఉత్సాహం ఎవరూ కలిగించలేక పోయారన్న మాట
  • 2. పాక పార్టీ పట్ల పెద్ద వ్యతిరేకత లేకపోవడం వ్ల యథాలాపంగా(క్యాజువల్‌)గా తీసుకున్నారనేది ఒక కోణం,
  • 3.వారికి వ్యతిరేకంగా మరొకరిని గెలిపించేంత పరిస్తితి లేకపోవడం వల్లనే నిరాసక్తంగా ఉన్నారనేది ఇంకో కోణం. అంటే  మీడియా  అత్యధికంగా చూపించిన ప్రత్యామ్నాయ పార్టీ, వారి హైప్‌ ప్రజను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం స్పష్టం.
  • 4.ఆ పార్టీ అనుసరించిన ప్రచార పద్దతు, మరో మత పార్టీ వారికి పోటీగా మాట్లాడిన మాటలు  అభద్రత పెంచాయనేది మరో అంశం.
  • 5.ఈ మూడు పార్టీల మధ్యలో ఎవరిని ఎంచుకోవాలో స్పష్టంగా నిర్ణయించుకో లేకపోవడం
  • 6. అన్నిటికన్నా తీవ్రమైన మరో కారణం కరోనా వైరస్‌. వయసు మళ్లిన వారు, వైరస్‌ బారిన పడిన ఇళ్లలో వారు ఓటింగ్ కు దూరంగా ఉండిపోవడం, చాలా మంది ఆ కారణంగా స్వంత వూళ్లకు వెళ్లిపోవడం
  • 7.మామూలుగా  మహానగరాలో వుండే నిరాసక్తత, కెటిఆర్‌ అన్నట్టు ట్వీట్లపై ఉండే శ్రద్ధ ఓట్లపై లేకపోవడం
  • 8.గతంలో కార్పొరేటర్ గా వున్న వారు గాని, పోటీ చేసిన వారు గాని తగినంతగా సంబంధాలు పెట్టుకుని  ఓటర్లను కదిలించలేకపోవడం.ఈ ఎన్నికలోనూ పెద్ద నాయకులే కావలసి రావడం
  • 9.స్థానిక సంస్థలకు పట్టు లేకపోవడం,సమస్యలు కొనసాగుతూ ఉండటం,వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడం
  • 10.ప్రచారం పోలింగ్‌ చాలా చాలా వేగంగా జరిగిపోవడం, ఓటర్ల జాబితాలో అవకతవకలు,ఆరోపణలు,

 

మొత్తంపైన చూస్తే బిజెపి హేమాహేమీలంతా తరలివచ్చి ప్రచారం చేసినా ఓటర్లను కదిలించలేకపోయారనేది అర్థమవుతుంది. ఇక తక్కువ ఓటింగ్ జరిగింది కనుక తమకు అనుకూలమని పాలక పార్టీ అనుకోవడానికి ఎక్కువ అవకాశముంటుంది. పోలింగ్ జరిగిన మేరకు పేద మధ్య తరగతి ఓటర్లే పాల్గొన్నారని వారంతా తమకే అనుకూలమని  ఆ పార్టీ భావించే అవకాశముంది. ఎగ్జిట్‌పోల్స్‌ కూడా రీ పోలింగ్‌ వరకూ ప్రకటించే అవకాశం లేదు కనుక మరో రెండు రోజు ఈ అంచనాలతోనే కాలక్షేపం చేయవచ్చు.