తెలకపల్లి రవి విశ్లేషణ: అమెరికా అద్యక్ష మార్పుతో అరాచకం ఆగుతుందా?

తెలకపల్లి రవి విశ్లేషణ: అమెరికా అద్యక్ష మార్పుతో అరాచకం ఆగుతుందా?

అమెరికా అద్యక్షుడుగా జో బిడెన్‌ కు జనవరి 20న అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు సహకరిస్తానని ప్రస్తుత అద్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన అనివార్యమైంది.  ఆఖరు క్షణంలో కూడా ఉపాద్యక్షుడు మైక్‌పెయిస్‌ ద్వారా ఏదైనా గందరగోళం చేయిచాలని ట్రంప్‌ బహిరంగంగానే పిలుపునిచ్చారు. కాని ఆయన అడిగిన దానికి భిన్నంగా అవసరమైతే 25వ సవరణ సెక్షన్‌ 4 కిందతననే తొలగించే పరిస్థితి  ఎదుర్కొవలసి వచ్చింది. అయినా సరే  శ్వేతసౌధంపై దాడి చేసి విధ్వంసానికి కాల్పులకు కారణమైన వారిని అసాధారణ వ్యక్తులు అని కొనియాడారు.వారిని తాను అర్థం చేసుకోగలనని మద్దతు ప్రకటించారు.మొదటిసారి యూరప్‌ దేశాలు, ఇండియాతో సహా అత్యధిక ప్రపంచాధినేతలు కూడా  దీన్ని ఖండిరచారు.ప్రపంచ నేతల్లో ఏ ఒక్కరికంటే ఎక్కువగా ఆఖరి వరకూ ట్రంప్‌ను నెత్తిన మోసిన ప్రధాని మోడీ కూడా తప్పని చెప్పవలసి వచ్చింది. దాంతో  ఫేస్‌బుక్‌  ట్విటర్‌ వంటివి కూడా ఆయన ఖాతాలు నిలిపేయాల్సి వచ్చింది. అయితే  బిైడెన,కమలా హారిస్‌్‌కు 306 ఎక్టొరల్‌ ఓట్లు వచ్చిన తర్వాత  తను చేయగలిగింది లేక చేతులెత్తేశారు. కాని
                    ఎన్నిక తర్వాత ఏ దశలోనూ ట్రంప్‌ ఫలితాను ఆమోదించలేదు.బిడెన్‌ను  నిజంగా అభినందించలేదు.రకరలుగా లీగల్‌ పేచీలతో చూరు పట్టుకువేళ్లాడాని చూశారు. కేసు వేశారు. మీడియాలో కథలు వదిలారు. స్థానికంగా సంఘర్షణు సృష్టించారు. అవి జాతి కహాలుగా మారే ప్రమాదం కూడా కనిపించింది. నెమ్మదిగానిలదొక్కుకున్న జో బైడెన్‌ బృందం తన పనితానుచేసుకుపోతున్నా ట్రంప్‌లో మార్పు రాలేదు.తనకు అత్యంత విశా ్వసపాత్రులన్నవారు కూడా అసహ్చించుకోవలసి వచ్చింది. చివరకు అద్యక్ష భవనంపైనే దాడికి తెగబడ్డారు. ఈ అరాచకం కేవలం వ్యక్తిగా ఆయనదే కాదు.అగ్రరాజ్యంగా అందరికీ నీతులు చెప్పి సైన్యాలను పంపి ఎన్నికలతో ఆడుకునే అమెరికా అసలు రూపం ఇది. 2000లో కూడా ఇలాగే బిల్‌ క్లింటన్‌ తర్వాత జూనియర్‌ బుష్‌ పగ్గాలు చేపట్టడానికి ముందు నెల తరబడి సంక్షోభం కొనసాగింది. కాని అప్పటికింకా ఆ దేశానికి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోగల శక్తి మిగిలివుందన్నమాట, ఇప్పుడు అదీ లేక అరాచకం తాండవిస్తోంది. ఇంతటితోనే అక్కడ ఏర్పడిన ఆరాచకపర్వం సమిసిపోతుందా?  పరివర్తనకు సహకరిస్తానంటూనే ట్రంప్‌ అమెరికా ఘన వారసత్వ పునరుద్ధరణకు జరిగే ప్రయత్నానికి ఇది ప్రారంభమని బెదిరిస్తున్నారు. కనుక ట్రంప్‌ వీరాభిమాన మూకలు  అఘాయిత్యాలు ఆపేస్తాయా అన్నది చూడాల్సిందే.
        అధికార పరివర్తనకు సహకరిస్తానని  ప్రకటనను చేయడానికి కూడా ట్విట్టర్‌ ఖాతా లేకుండా పోవడంట్రంప్‌ పతనానికి పరాకాష్ట. అధికారాంతమందు చూడవలె నా యయ్య సౌభాగ్యముల్‌ అంటారు గాని ఇంత అవమానకరంగా దిగిపోయినవారుండరేమో! ఆఖరులో చేసిన ప్రకటనను బట్టి 2024లో మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్‌ సూచించినట్టు భావిస్తున్నారు, అయితే అప్పటికి ఆయన వయస్సు, పరిస్తితు అనుకూలంగా వుంటాయా పోటీదారులెవరు చాలా అంశాలువుంటాయి. ఇప్పటికైతే కరోనా సవాలు, ఆర్థిక సామాజిక సంక్షోభం అంతర్జాతీయ ఆధిపత్యానికి బీటు అమెరికాను వెన్నాడుతున్నాయి.జో బిడెన్‌ కూడా విధానాలు మార్చేది పెద్దగా వుండదు గనక సంక్షోభమూ తగ్గక పోవచ్చు