తెలకపల్లి రవి: ఫార్ములా ప్రాంగణం దాటుతున్న తెలుగు సినిమా?

తెలకపల్లి రవి: ఫార్ములా ప్రాంగణం దాటుతున్న తెలుగు సినిమా?

చాలా  దశాబ్దాల తెలుగు సినిమా ఫార్ములా మూసను ఛేదించలేకపోతున్నది. హీరో అభిమానులు స్వీకరించబోరంటూ ప్రతి దానికి కొన్ని కొలబద్ద పెట్టి వాటిలోనే బంధించే ప్రయత్నం సాగుతున్నది.ఇది హీరోకూ దర్శకులకు కూడా సుఖప్రదంగా వుండొచ్చు గాని వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంటుంది.సాహసోపేతమైన సామాజిక ఇతివృత్తాలు, వైవిధ్య భరితమైన ప్రయోగాలు లేకుంటే సృజనశీలమైన సినిమా అనేది కొడిగట్టిపోతుంది.దీనికి తోడు పరిశ్రమలో పోటీ అనుకరణలు కలిసి రిస్క్‌ ఎందుకనే పరిస్థితిని సృష్టిస్తాయి. ఎన్టీఆర్‌ అక్కినేని నుంచి చిరంజీవి వరకూ కొన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు ఆశించిన స్తాయిలో లేవని మళ్లీ పాత వరవడికే వెళ్లడం జరుగుతూ వచ్చింది. తమిళచిత్రాలో చాలా బలమైన భరించలేని  డీ గ్లామర్‌ చిత్రణ, మళయాంలో రాజకీయం మేళవించిన వాణిజ్య బాణీ పెరగ్గా తెలుగులో అచ్చమైన వాణిజ్య విలువలు విజయం గురించిన ఆలోచనలే రాజ్యమేలాయి. కొంతమంది దర్శకుల కారణంగానూ పరిస్థితుల కారణంగా  ఇప్పుడిప్పుడే ఈ ధోరణిలో కొంత మార్పు వస్తున్నదా? పరిమితంగానైనా ఇది ఒక ప్రారంభం అని చెప్పాల్సిందే,
        సుకుమార్‌ రాంచరణ్‌ రంగస్థం వంటి చిత్రం మామూలుగానైతే   మనం తెలుగులో వూహించగలిగే వాళ్లం కాము. కానీ అది పెద్ద విజయమే సాధించింది. కొరటా శివ  వంటి దర్శకులు ఫార్ములా పరిధిలోనే ఒకింత సందేశం జోడించి  పెద్ద తారతో చిత్రాలు తీసి విజయాలు అందించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ లాంటివారు కథకన్నాకథనంలోపాత్రలో కొత్తదనంచూపించి మెప్పిస్తే రాజమౌళి లాంటివారు  కల్పానిక కథతో కొత్త రికార్డు నెలకోల్పారు, ఇదంతా చూస్తున్నదే. అయితే  కరోనా తాకిడి,థియేటర్లు చాలా కాలంగా మూసుకోవడం ఓటీటీ  రాక పరిస్థితిని మరింత మార్చేశాయి. ప్రేక్షకులకు ఆప్షన్స్‌పెరిగాయి. సబ్‌టైటిల్స్‌ వంటివి సుభమై పోయి అన్నిభాష చిత్రాలు  ఆనందించే వాతావరణం మాత్రమే గాక అనివార్యత కూడా వచ్చింది.  మూసచిత్రాలతో ఎంతో కాలం ఆదరించడం సాధ్యం కాదనే గుర్తింపు కూడా పెరిగింది. తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేసే అవకాశం కొత్త తరం దర్శకులకు వచ్చింది.ఇవన్నీ కలిసి కొత్త కథవైపు చూసేలా చేశాయి.
          పవన్‌కళ్యాణ్‌ వకీల్‌సాబ్‌కు పింక్‌ ఆధారమైనప్పటికీ  ఆ తరహా యాంటీసెంటిమెంట్‌ కథను సగటు తెలుగు సినిమాలో ఎన్నడూ వూహించగలిగేవాళ్లం కాదు. గతంలోనే జయం మనదే తో కుల సమస్యపై చిత్రంలో నటించిన వెంకటేశ్‌ ఇప్పుడు అసురన్‌ ఆధారంగా నారప్పలో నటించారు. దృశ్యం 2 కూడా చేశారు, చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌ కూడా కొంచెం భిన్నమైన కథతో రీమేక్‌లోనటించడానికి సిద్ధమైనారు. సుకుమార్‌  అల్లు అర్జున్‌ పుష్ఫ కూడా రస్టిక్‌గా వుండబోతున్నట్టు అర్థమవుతుంది. మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్ కూడా భిన్నమైన కథల్లోనే కనిపించడం ఖాయం. ఈ లోగా అసలు ప్రఖ్యాతులు గాని యువ దర్శకులు తారలు  కూడా చిత్రాల ద్వారానే ఆకట్టుకుంటున్నారు. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌, ఆచార్య వంటి చిత్రాలు ఫార్ములాలోనూ కాల్పానికతతోనూ  పెద్ద ప్రభావం చూపిస్తాయని పరిశ్రమ భావిస్తున్నది. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఈ కొత్త పరిస్థితులకు హీరోలు వారి అభిమానులనేవారు కూడా అలవాటు పడవలసి వస్తుంది.దర్శకుల శ్రమ నిర్మాత భారం కూడా పెరగొచ్చు. కాని ఒకమేరకు మార్పు మాత్రం మొదలైంది,  అచ్చంగా   ఫార్ములాతరహాకే పరిమితమై ఆలోచించేపరిస్తితి మళ్లీరాకపోవచ్చు. ఇందుకు పెద్ద నిర్మాతలు నిలదొక్కుకోవడం కూడా ఒక కారణం.