తెలకపల్లి రవి : సుప్రీంకోర్టు స్టే - అమరావతి ఆరోపణ - ప్రసారానికి బాట

తెలకపల్లి రవి : సుప్రీంకోర్టు స్టే - అమరావతి ఆరోపణ - ప్రసారానికి బాట

అమరావతి రాజధాని ప్రాంతంలో ఎపి మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ జరిపిన భూ లావాదేవీలపై ఎసిబి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ ను మీడియాలో గాని సోషల్‌ మీడియాలో గాని ప్రచురించరాదంటూ హైకోర్టు సెప్టెంబరు 15న ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ పై సుప్రీం కోర్టు ఈ రోజు స్టే విధించింది. తద్వారా వాటి ప్రచురణకూ,ప్రజలు నిజా నిజాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించిందని చెప్పాలి. అదే సమయంలో ఆ కుంభకోణం ఆరోపణపై దర్యాప్తు నిలిపి వేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే కేసును 2021 జనవరి వరకూ వాయిదా వేస్తూ ఆలోగా దమ్మాలపాటి పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆదేశించింది.

ఆరోపణ ఎఫ్‌ఐఆర్‌ ప్రచురణకు అవకాశమివ్వడం ద్వారానూ, తదుపరి విచారణ కొనసాగకుండా నియంత్రించడం ద్వారానూ సుప్రీంకోర్టు చొరవ తన చేతిలోకి తీసుకున్నట్టయింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె కె మహేశ్వరి అప్పటికప్పుడు స్టే ఇచ్చారు గాని కేసు సమగ్ర విచారణ జరగవలసి వుంది. కనుక హైకోర్టు కూడా ఇంకా అసలు కేసును తీసుకోలేదు. ఇప్పుడు తీసుకునే అవకాశం కూడా వుండకపోవచ్చు. ఈ తీర్పును ప్రభుత్వానికి చుక్కెదురుగా కొన్ని మీడియా సంస్థలు చెప్పడం వాస్తవ విరుద్ధం. మీడియాలో విమర్శకులోనూ రాజకీయ పార్టీలు న్యాయవర్గాలోనూ ఎక్కువ నిరసన వచ్చింది.

కోర్టు ముందుకు వచ్చిన అంశా ప్రచురణ కాకుండా ఆంక్షలు విధించడం పైనే. దాన్ని కొట్టివేయడం కీలకమైన అంశం. ఈ ఆరోపణలు దర్యాప్తు ఎఫ్ఐఆర్‌ దురుద్దేశపూరితమని దమ్మాలపాటి తదితరు తరపున ముకుల్‌ రోహ్తగి,హరీశ్‌ సాల్వే చేసిన ఆరోపణను ప్రభుత్వ తరపు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ గట్టిగానే ఎదుర్కొన్నారు. మాజీ అడ్వకేట్ జనరల్‌ అయినంత మాత్రాన నిబంధలను మారవని, తప్పు జరిగినట్లు దృష్టికి వచ్చాక ప్రభుత్వం దర్యాప్తు జరపకుండా ఎలా వుంటుందని ప్రశ్నించారు. దీన్ని ముందే నిలిపేయడం వార్తలు కూడా రాకూడదని చెప్పడం జర్ననీలో నాజీ పాలనను తలపిస్తున్నదని విమర్శించారు.

స్టే ఎత్తివేతపై హైకోర్టును ఆశ్రయిం చకపోవడం పొరబాటని ప్రతివాద లాయర్లు అన్నప్పుడు ఇంత దారుణమైన ఉత్తర్వులిచ్చిన తర్వాత న్యాయం ఎలా ఆశించగమని ఆయన ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి ఆ రోజు సాయంత్రం విచారించి స్టే ఇవ్వడం చూస్తే ఏవో బాహ్య శక్తుల ప్రభావం కనిపిస్తుందని అయితే తాము కోర్టుకి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని అన్నారు.

ఏపీలో ప్రస్తుతం సాగుతున్న న్యాయ రాజకీయ వివాదం నేపథ్యంలో సుప్రీం స్టే, కేసు విచారణకు వ్యవధి తీసుకోవడంలో చాలా లోతైన ప్రభావం వుంటుంది. మొదటిది ఎఫ్‌ఐఆర్‌ను ప్రచురించినప్పుడు అందులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లు కూడా వుంటాయి.ఒకసారి ఆ వార్తలు ప్రచురణ అయ్యాకముఖ్యమంత్రి జగన్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు రాసిన లేఖలో వాటిని పేర్కొనడం తప్పన్న వాదన పదును కోల్పోతుంది. హైకోర్టు ఆపడం వల్ల వాటి గోప్యత భించిందిగాని లేకపోతే ఆయనబహిరంగ విషయాలే రాశారని చెప్పడానికి వీలుంటుంది.  ఆ విధంగా చర్చ మరింత వేడెక్కుతుంది.