తెలకపల్లి రవి : సుప్రీం సిజెగా రమణ, తీవ్ర సవాళ్లు 

తెలకపల్లి రవి : సుప్రీం సిజెగా రమణ, తీవ్ర సవాళ్లు 

సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్‌ ఎన్‌విరమణ ప్రమాణ స్వీకారం చేశారు. 2013లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా  నియమితులైన  జస్టిస్‌ రమణ అంతకు ముందు ఉమ్మడి ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాక  ప్రధాన న్యాయమూర్తిగా, ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  కూడా బాధ్యతలు నిర్వహించారు. తెలుగు వ్యక్తి  ప్రధాన న్యాయమూర్తి కావడం ఇది రెండోసారి. యాభై ఏళ్ల కిందట జస్టిస్‌ లోకోకా సుబ్బారావు కూడా సిజెగా పనిచేశారు. అయితే రాష్ట్రపతిగా పోటీ చేసేందుకై ఆయన ఏడాది తిరక్కుండానే రాజీనామా చేశారు, 1993-94లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ వెంకటచలయ్య కూడా  ఇప్పటి ఎపిలోని లేపాక్షిలో జన్మించిన వ్యక్తి అయినప్పటికీ అది అప్పుడు ఉమ్మడి కర్ణాటక రాష్ట్రంలో బాగంగా వుండేది, మన్నెపల్లి నారాయణరావు వెంకటచలయ్య అన్న ఆయన పేరు కూడా అచ్చం తెలుగు వారి పేరే అయినా చదువు కర్ణాటకలో సాగింది,  ఈ మధ్య కాలంలో తెలుగువారు అనేకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి స్థానం దాకా పయనించే అవకాశం జస్టిస్‌  నూతలపాటి వెంకటరమణకే దక్కింది, ఆయన పదవీ కాలం కూడా సాపేక్షంగా చాలా మంది సిజెల కన్నా అధికంగా ఉంటుంది. ఏప్రిల్‌24 నుంచి 2022 ఆగష్టు 26 వరకూ పదహారు నెలల పాటు పదవిలోవుంటారు

    చాలా దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి కావడం పట్ల  సంతోషం వ్యక్తమైనా సుప్రీంకోర్టు ప్రతిష్ట అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రధాన న్యాయమూర్తుగా ఎస్‌ఎబాబ్డే, అంతకు ముందు రంజన్‌ గోగోయ్‌ హయాంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం ఒత్తిళ్లకు లోబడిపోయిందనే ఆరోపణ బపడింది. వరుసగా ఇచ్చిన తీర్పు మోడీసర్కారుకు సంతోషం కలిగించాయి.సిజెఐగా రంజన్‌గోగోయ్‌ అయోధ్య, రాఫెల్‌ తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యత్వం పొంది విమర్శలు మూటగట్టుకున్నారు. ఇక 2019 నవంబరులో ఎస్‌ఎబాబ్డే ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినప్పుడు కీలకమైన ఎన్నో కేసు న్యాయస్థానం ముందు అపరిష్కృతంగా వుండిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని తొగించి మూడు ముక్కు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన కేంద్రం నిరంకుశ చర్యను సవాలు చేస్తూ వంద పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ వాటిపై పూర్తి విచారణ జరగనేలేదు. పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పైనా పిటిషన్లు వచ్చాయి.ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా నిరసనలు సాగాయి.ముఖ్యంగా ఢిల్లీలో కుట్రపూరితంగా మత కలహాలు రగిలించి యువతను విద్యార్థును అరెస్టు చేసి అక్రమ కేసు పెట్టారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం లో దాడులు జరిగాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలోకి గ్యాంగు చొరబడి దౌర్జన్యం చేశారు. ఇవన్నీ కళ్ళ ఎదురుగా జరుగుతున్నా పలుసార్లు కేసులు వస్తున్నా సుప్రీంకోర్టు న్యాయం చేసేందుకు చొరవతీసుకోలేదు.హత్రాస్‌ అత్యాచారం ఘటనలో అన్నాయంగా అరెస్టు చేయబడిన కేరళ జర్నలిస్టు స్దిక్‌ కప్పన్‌ కేసు వస్తే విచారించి మీడియా స్వేచ్చను కాపాడ కపోగా ఇలాంటి కేసు హైకోర్టుకు వెళ్లేలా తాను చర్యలు తీసుకుంటానని ప్రకటించారు.

               ఇంతకంటే తీవ్రమైన విషయం ఎన్నికల బాండ్లకు సంబంóంచిన కేసును పూర్తిగా పక్కన పెట్టేయడం.ప్రతి ఎన్నికల సమయంలోనూ  ఆ బాండ్లపై స్టే విదించాలంటూ పిటిషన్లు వస్తూనే వున్నాయి.   ప్రతిసారి సుప్రీం కోర్టు ధర్మాసనం వాటిని పక్కన పెడుతూ వచ్చింది. వలస కార్మికుల దుస్థితిపై దాఖలైన వాజ్యా విషయంలోనూ  ఏం చేయాలనే ప్రభుత్వానికే బాగా తొసంటూ కేసును చాలా కాం సాగదీశారు. ఆఖరుకు సీజే బాబ్డే స్వయంగా వలసకార్మికులకు తిండి పెడుతున్నప్పుడు మళ్లీ ఆర్థిక సహాయం దేనికని ప్రశ్నించారు.ఢిల్లీలో రైతుల ఆందోళనను పరిష్కరించానే కేసులోనూ ఒక కంటితుడుపు కమిటీని వేసి కాలయాపన చేసిం. ఆ కమిటీ కూడా ప్రభుత్వ అనుకూల వ్యక్తుతో నిండి ఉండటం,ఒకరు ముందే నిరాకరించడం దాన్ని మరింత పలచన చేసింది. తీరా ఆ కమిటీ సిఫార్సు వచ్చి చాలా కాలం గడిచినా ఎలాంటి సానుకూల చర్యలు ఆదేశించింది మాత్రం లేదు. ప్రజ  హక్కులను కాపాడ్డంలో  ఈ విధంగా వ్యవహరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కార కేసు పేరిట ఎంతో సమయం వెచ్చించి. అయోధ్య కేసులో 1991 ప్రార్థనాస్థలా చట్టం ప్రాతిపదికగాచెప్పిన న్యాయస్థానం ఆ చట్టాన్నే సవాలు చేసే పిటిషన్‌ను అనుమతించడం మరో వైపరీత్యం.ఆ వెంటనే కాశీ,మధుర క్షేత్రాలో వివాదాలు స్థానిక న్యాయస్థానాు చేపట్టాయి.

             కరోనా కారణంగా ఈ కాంలో వర్చువల్‌ విచారణ పద్ధతి గొప్పమార్పుగా చెబుతున్నా వాస్తవంలో . కేవలం 25 శాతం మాత్రమే విచారణ జరిగాయి. కొత్తగా ఆర్టిఫిషియల్‌ ఇంటజెన్స్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కోర్టు చర్యు సాగిస్తున్న.వాటి పాత్రపై న్యాయమూర్తుకే స్పష్టత లేదు.  ఈ మొత్తం కాలంలో సుప్రీంకోర్టుకు ఒక్క న్యాయమూర్తిని కూడా అదనంగా నియమించ లేకపోవడం పెద్ద లోపం.హైకోర్టులో 400 పైనే ఖాళీగా ఉన్నా కొలీజియం కేంద్రం పరస్పరం బాధ్యతను నెట్టివేసుకుంటూ కాం గడిపాడు. పదవీ విరమణకు ముందు రోజు సిజె బాబ్డేతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 224(ఎ) అóకరణాన్ని దాదాపు 60ఏళ్ల తర్వాత పునరుద్ధరించి,రిటైర్డు జడ్జిను హైకోర్టుకు నియమించవచ్చునని ఆనుమతినిచ్చింది. క్రమబద్దమైన నియామకాలు పూర్తి చేయకపోగా ఈ విధంగా విచక్షణతో కూడిన నియామకాలు చేస్తే మళ్లీ అదెక్కడికి దారితీస్తుందోననే సందేహాలు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతూ ఒత్తిడికి గురి చేస్తున్నదనే అభిప్రాయం అందరిలో నెల కొంది. మాజీ సీనియర్‌ న్యాయమూర్తు అరుణ్‌ మిశ్రా వంటివారు ప్రధాని మోడీని అదేపనిగాపొగిడి తరించడం,రంజన్‌ గోగోయ్‌ రాజ్యసభకు వెళ్లడం ఆ సందేహాలు పెంచింది. 

రాజకీయ నాయకుపై ప్రజాప్రతినిధుపై కేసుసు వేగంగా పరిష్కరించాన్న గతంలో జస్టిస్‌ రమణ తీసుకున్న కీలక నిర్ణయం. పేదలకు కూడా న్యాయసహాయం సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సిపార్సుకు ముందు రోజు ఆయన చేసిన ప్రసంగం.నదీ జలా వివాదాలు రాష్ట్రా హక్కుకు సంబంóంచి కూడా ఆయన తీర్పును ప్రస్తావిస్తుంటారు. తెలుగు రాష్ట్రాకే నదీజ వివాదాలు ఒకవైపు రాష్ట్ర హక్కుపై  కేంద్రం తీవ్ర దాడి మరోవైపు సాగుతున్న ఈ కాలంలో మరి ఆయన తీర్పు పరంగానూ న్యాయ వ్యవస్థ నిర్వహణ పరంగా ఎలాంటి అడుగు పడే చూడవలసిందే. చట్టంవ్యవస్థపౖ ఆధారపడిరదే గానివ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదన్న కారల్‌మార్క్క్స్‌ మాట ప్రకారం వ్యక్తులను బట్టి మౌలిక మార్పుకు పెద్ద అవకాశముందకపోయినా న్యాయమూర్తు చేయగలిగింది చాలానే వుంటుంది. మసకబారిన సుప్రీం ప్రతిష్ట రీత్యా కొత్త సిజెఐ ఎన్‌వి రమణ ఏం చేస్తారనే రేపటినుంచే చూడొచ్చు.