తెలకపల్లి రవి : మీడియాలో పెడపోకడకు పరాకాష్ట 

 తెలకపల్లి రవి : మీడియాలో పెడపోకడకు పరాకాష్ట 

ఇటీవలి కాలంలో అనేక మీడియా సంస్థ విలువలు ఎంతగా క్షీణిస్తున్నాయో, తమ వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం అనర్థదాయక ధోరణులను ఎంతగా పెంచుతున్నాయో చూస్తే విచారం కగకమానదు. అసలైన సమస్య నుంచి దృష్టి మళ్లించడం కోసం అవాంచనీయమైన అనారోగ్యకరమైన చర్చలు  కార్యక్రమాలతో అభాసు పాలవడం, మార్కెట్‌ నిలుపుకోవడం కోసం కృత్రిమంగా రేటింగు తెప్పించుకోవడానికి పడే పాట్లు అత్యున్నత స్థాయిలోనే వెల్లడైనాయి. చివరకు బార్క్‌ మూడు మాసా పాటు రేటింగు ప్రక్రియనే నిలిపివేస్తున్నట్టు ప్రకటించడానికి ఈ పరిణామాలు దారి తీశాయి.

రాజకీయ పార్టీలు లేదా కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం గీత దాటిన కొన్ని  పోకడలు కొత్తేమీ కాదు గాని రాను రాను అసలు ప్రజలకు సమాచారం, సమగ్ర అవగాహన ఇచ్చే బాధ్యతనే విస్మరించడం అప్రధాన విషయాలలో ముంచి తేల్చడం వికృతంగా మారింది. మరో వంక విమర్శల పట్ల  ప్రభుత్వాల అసహనం పెరిగి ఇలాటి విన్యాసాలకు  పరోక్ష ప్రోత్సాహం పెరిగింది. ఫలితమేమంటే  ఈ కాలంలో జాతీయ చానళ్ళనేవి పదే పదే సుప్రీం కోర్టు తలపు తట్ట వలసి వచ్చింది. తాజాగా రిపబ్లిక్‌ టీవీ అధినేత ఆర్నాబ్‌ గోస్వామి పిటిషన్‌ ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ముంబయి హైకోర్టు కే వెళ్లవసిందిగా సూచించింది.

కరోనా తారా స్థాయిలో వున్నప్పుడు  ఇళ్లకు వెళ్లానే ఆరాటంలో వలస కార్మికులు పొరబాటు సమాచారం వల్ల బంద్రా రైల్వే స్టేషన్‌ కు చేరితే మత ముద్ర వేయడానికి పెద్ద ప్రచారం చేపట్టాడాయన. ఏదో గ్రామంలో ఇద్దరు సాధువుల హత్యను సోనియాగాంధీ దాకా తీసుకువెళుతూ ఆసమయంలోనే మరో హడావుడి చేశారు, దీని పై మహరాష్ట్ర పోలీసు;లు నోటీసు ఇస్తే తనదైన శైలిలో హంగామా చేశారు. తాత్కాలిక ఉపశమనం తప్ప ఈ పోకడకు న్యాయస్తానాలలోనూ రక్షణభించ లేదు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషాదాంతం తర్వాత ఈ ధోరణి పరాకాష్టకు చేరింది.

బీహార్‌ ఎన్నికలో ఎదురుగాలి తట్టుకోవడానికి ఈ అంశాన్ని ఆధారం చేసు కోవాలని నితిశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమి భావించగా అక్షరాలా అందుకు తగినట్టే కంగనా రనౌత్‌ ను ముందుంచి ఆర్నాబ్‌ షో నడిచింది. ఇది ఏకంగా బాలివుడ్‌ పైనే దాడిగా మారింది. ప్రైవేటు మెసేజ్‌ లు, ఆరోపణు హద్దుమీరిన స్థాయిలో పొంగిపొర్లాయి. దీనికి ముఖ్యమంత్రి ఠాకరే కారణమన్నట్టు కూడా వ్యక్తిగత ప్రచారం నడిచింది. ఎట్టకేలకు ఈ కేసు కేంద్రంలోని సిబిఐకి అప్పగించినా  ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దాంతో డ్రగ్స్‌ వైపు మరల్చబడింది. తీరా సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్య నివేదికలో స్పష్టం కావడంతో కథ మొదటికి వచ్చింది.

ఆ వివరాన్నీ అప్రస్తుతం కానిహత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం ఉదంతం సమయంలో వీక్షకుల దృష్టి మళ్లించడానికి  ఇదంతా కావాలనే జరిగినట్టు స్పష్టమై పోయింది. సరిగ్గా ఇలాటి తరుణంలోనే ముంబయి పోలీసుల టిఆర్‌పి కుంభ కోణం కూడా వెలికి తీశారు. ఇందులోనూ మరో రెండు మరాఠీ చానళ్లతో పాటు రిపబ్లిక్‌ టీవీ ముందుగా దొరికిపోయింది. సుశాంత్‌ సింగ్‌ ఉదంతంలోనూ డ్రగ్స్‌ వ్యవహారం లోనూ తమపై ఇష్టానుసారం దుష్ప్రచారం చేసినందుకు అర్నాబ్‌ గోస్వామి పై బాలీవుడ్‌ హేమాహేమీలు  అమీర్‌ ఖాన్‌ సల్మాన్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ మహేష్‌ భట్‌ తదితరుందరూ దావా వేశారు.

అమితాబ్‌ బచ్చన్‌ కూడా తన అసమ్మతిని ఒక షోలో వెల్లడి చేశారు, ఇప్పుడు బయిటకు వచ్చింది చూస్తున్నది కేవలం శాంపిల్‌ వంటిది మాత్రమే. ఆర్నాబ్‌ ఈ కాలంలో చేసిన చర్చలో 70శాతం విద్వేషం పెంచేదిగా వుందని మీడియా నిపుణులైన కోట శైలజ మరో పిటిషన్‌ దాఖలు చేశారు, కార్యక్రమాలు, ప్రచార పోకడలు, రేటింగు ప్రతిదీ వివాదగ్రస్తమై విమర్శాపాత్రమైన ఈ పరిస్తితి ఆర్నాబ్‌కే పరిమితం కాదు, తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ అంతర్జాతీయంగానూ కూడా ఈ సమస్య తీవ్రమవుతున్నది. అమెరికా అద్యక్ష ఎన్నికలో ఇదో పెద్ద వివాదంగా వుంది. వీక్షకుల విమర్శనాత్మకంగావుండటం అవసరమని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. సోషల్‌ మీడియా కూడా ఇలాటి అభిశంసననే ఎదుర్కొంటున్నది. ఆ వివరాలు మరోసారి చూద్దాం,