తెలకపల్లి రవి : బిజెపి వ్యతిరేక జాతీయ వేదికకై కెసిఆర్‌ సన్నాహం

తెలకపల్లి రవి : బిజెపి వ్యతిరేక జాతీయ వేదికకై కెసిఆర్‌ సన్నాహం

            దుబ్బాక గెలుపు వూపుతో జిహెచ్‌ఎంసి ఎన్నికలో హడావుడి పెంచిన బిజెపిని నివరించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ మొదలెట్టిన వ్యూహం ఏకంగా జాతీయ రాజకీయాలో ప్రతిపక్షా కలయికగా మారడం ఎవరూ వూహించని పరిణామం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలబిజెపి వ్యతిరేక జాతీయ వేదికకై కెసిఆర్‌ సన్నాహంలకూ,బిజెపివిధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్‌ రెండవ వారంలో  ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. దీన్ని కేవలం కార్పొరేషన్‌ పాచికలుగా కొట్టిపారేసేవారున్నా దేశంలో పరిణామాలను బట్టి అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. గతంలో బిజెపితో మెతగ్గా స్నేహంగా మసలినా కెసిఆర్‌  క్రమేణా విమర్శ జోరు పెంచడం కనిపిస్తూనే వుంది. హిందూత్వ రాజకీయా   దూకుడు పెంచడమే గాక  రాష్ట్రా హక్కులు అదికారాలు వనరులను  హరిస్తున్న కేంద్రం ధోరణి ఇందుకు  ప్రధాన కారణం. రైతు వ్యతిరేక శాసనాలు, పౌరసత్వ సవరణ చట్టం, విద్యుత్‌ సంస్కరణ పేరట ప్రైవేటీకరణకు పెద్ద పీట, జిఎస్‌టి బకాయిలపై దొంగాలటకం ఇవన్నీ రాష్ట్రాలో నిరసన పెంచాయి. కేరళలోని  ఎల్‌డిఎప్‌ ప్రభుత్వం,  బెంగాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రుల, కాంగ్రెస్‌ ప్రభుత్వాలతో పాటు ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన వేదికలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా పాలుపంచుకుంది. కేంద్ర శాసనాలకు వ్యతిరేకంగా శాసనసభలోతీర్మానాలు చేసింది. కనుక ఇది  ఒక రోజు జరిగిన పరిణామం కాదని చెప్పొచ్చు. 

     రాష్ట్రంలో తానే ప్రత్నామ్నాయంగా అధికారంలోకివస్తామని ఎప్పుడూ చెబుతున్న బిజెపికి బండి సంజయ్‌ అద్యక్షుడైనాక  ప్రభుత్వంపై దాడి తీవ్రతే గాక భాష కూడా మారింది. మజ్లిస్‌తో టిఆర్‌ఎస్‌కు వున్న స్నేహాన్ని ప్రధానంగా చూపిస్తూ  తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించేవరకూ వెళ్లింది. తాము కేంద్రం నుంచి పంపే నిధులతోనే అంతాజరిగిపోతున్నట్టు కెసిఆర్‌ వాటిని తమ పథకాలగా చలామణి చేసుకుంటున్నట్టు ఆరోపణలు నిత్యకృత్యమైనాయి. ఈ పూర్వరంగంలోనే దుబ్బాక  ఉప ఎన్నికలో కేంద్ర రాష్ట్ర పథకాలు నిధుల గురించి సవాళ్లు ప్రతిసవాళ్లతో నడిచాయి. బిజెపి నోట్లపట్టివేత నాయకుల అరెస్టు కూడా వేడినిపెంచాయి. చివరకు వచ్చిన  ఫలితం టిఆర్‌ఎస్‌కు తొలి  రాజకీయ దెబ్బగా పరిణమించింది. ఈ కారణంగానే జిహెచ్‌ఎంసి ఎన్నికలు కూడా  అనుకున్న దానికంటే ముందే జరిపించేస్తున్నారన్నది జనవాక్యం. బిజెపిని కావాలని పెద్దదిగా చేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నా ఎవరూదాన్ని తీవ్రంగా తీసుకోవడం కష్టం. అసలు కాంగ్రెస్‌లో అంతర్గతంగానే అసంతృప్తి ప్రజ్వరిలుతున్నది. దేశమంతటా దెబ్బతింటున్న కాంగ్రెస్‌ తెంగాణలోనూ వెనకబడివుండగా దానికోసం లేని బిజెపిని పెద్దగా చూపడం జరిగేపనికాదు. త్రిపురలో అస్సాంలో బిజెపి అధికారానికి రావడం బెంగాల్‌లోనూ పెద్దపార్టీగా రూపొందడం జరిగాక ప్రాంతీయ పార్టీలు దాని సవాలును తీవ్రంగానే తీసుకుంటున్నాయి. మరోవంక విధానపరంగా ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్‌ వంటివి కూడా దూరమవుతున్నాయి.కనుక గతంలోనే విమర్శులు పెంచుతున్న కెసిఆర్‌ వంటివారు మరింత దాడి పెంచడంలో ఆశ్చర్యం లేదు.

               కాకుంటే  ఈసారి ముఖ్యమంత్రి విమర్శలో కేవలం రాజకీయ విధానాలే గాక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వంటి అంశాలుకూడా ప్రస్తావనకు రావడం అరుదనే చెప్పాలి. వామపక్షాలు కార్మిక సంఘాలు మినహా తక్కిన వారు ఈ అంశాలను వ్యతిరేకించడం సాదారణంగా చూడం. వాటి విధానాలు అంతకంటే  ఎక్కువగా ప్రైవేటుబాటలో వుండటమే కారణం, పాత కాలపు రాజకీయ వేత్త అయిన కెసిఆర్‌ సింగరేణి, విద్యుత్‌, ప్రభుత్వ ఆస్పత్రుల గురుకులా  వంటి విషయాలో  కొంతవరకూ ప్రభుత్వ పాత్రను కాపాడాలనే వైఖరి తీసుకోవడం వాస్తవం, హైదరాబాదులో ప్రభుత్వ రంగ మాజీఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగానూ వుంటుంది. మైనార్టి జనాభా కూడా గణనీయం. కెసిఆర్‌  వ్యూహం వెనక ఈ కారణాలన్నీ వుండొచ్చు. గతంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి ఆయ్యాక విజయవాడలో ప్రతిపక్షా శిఖరాగ్ర సభ జరపడం పెద్ద సంచలనమైంది.  ఆయన ఎప్పుడూ కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమి నిర్మాణానికి ముందున్నారు. రథయాత్ర తర్వాత బిజెపిని దూరం వుంచారు కూడా. మౌలికంగా ఎన్‌టిఆర్‌ హయాంలో పైకి వచ్చిన కెసిఆర్‌  ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా ఆ తరహాను ఆసురసరిస్తే పెద్ద మార్పే అవుతుంది. ఇప్పటికే చాలా మంది తో మాట్లాడానని ఆయన చెబుతున్నారు. 2018లో బిజెపి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా  కెసిఆర్‌ చెప్పిన ఫెడరల్‌ ప్రంట్‌ మోడీకే మేలు చేస్తుందనే భావం వచ్చింది. అది వాస్తవ రూపం దాల్చలేదు కూడా. ఇప్పుడు కేవలం బిజెపినే వ్యతిరేకంగా అని చెప్పడం, దేశంలోనూ వారిపై వ్యతిరేకత పెరగడం బట్టి ప్రస్తుత ప్రతిపాదనను భిన్నంగా చూడవలసి వుంటుంది. కార్పొరేషన్‌ ఫలితాలు ప్రభావాలు తర్వాత గాని దీని స్వరూపస్వభావాలు స్పష్టం కావు. అయితే బిజెపి గుత్తాధిపత్యం పెరగకుండా ఆపే ఒక ప్రయత్నంగా మాత్రం  చెప్పకతప్పదు.