తెలకపల్లి రవి : జనసేన అస్త్రసన్యాసం, ఒక యాంటీ క్లైమాక్స్‌

తెలకపల్లి రవి : జనసేన అస్త్రసన్యాసం, ఒక యాంటీ క్లైమాక్స్‌

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపికి ప్రచారం చేయాని జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రకటింకడం ఒక యాంటీ క్లైమాక్స్‌. నగరంలో అనేక చోట్ల తమకు బలమైన కార్యకర్తలున్నారు, పోటీ చేయాలంటూ ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నారు కనుక పోరాటంలో దిగుతామని  ఆయన చెప్పారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌తో పొత్తుపై చర్చలు జరపనున్నట్టు ఆ పార్టీ  రాష్ట్ర కార్యాలయం బాధ్యులొకరు ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ విషయంలో అద్యక్షుడిదే తుది నిర్ణయమని తగు సమయంలో ప్రకటిస్తారని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.  ఈ లోగా బండి సంజయ్‌ పవన్‌ను కవబోతున్నట్టు కథనాలు ప్రసారమైనాయి.

తర్వాత కొద్ది సేపటికే ఆయన అదేమీ లేదని తనతో ఈ విషయమై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడనే లేదని సంజయ్‌  చేసిన ఖండన ప్రచారంలోకి వచ్చింది. బండి సంజయ్‌  అద్యక్ష పదవి చేపట్టిన తర్వాత పవన్‌ను కలుసుకోవడం, ఇటీవల దుబ్బాక విజయం తర్వాత కూడా ఆయన అభినందనలు చెప్పడం అందరికీ తెలిసినవే. పవన్‌ తనకు  దగ్గరే అయినా ఈ ఎన్నికలపై మాట్లాడిరది లేదని తాము దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థలును ఖరారు చేశామని బండి  సంజయ్‌ తేల్చేశారు,  తెలుగు దేశం మొత్తం నూటయాభై చోట్ల  పోటీ పెడుతుంటే జనసేన 60 డివిజన్ల వరకూ పోటీచేయొచ్చని సంకేతాు మెవడ్డాయి.

ఇంతవరకు వచ్చాక హఠాత్తుగా శుక్రవారం అంటే నామినేషన్లకు  ఒక్కరోజే ఉందనగా బిజెపి నేతు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఆపార్టీ జాతీయ ఒబిసి మోర్చా అద్యక్షుడు డా.లక్ష్మణ్‌ పవన్‌తో చర్చలు జరపడం తాము పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పడం నిజంగానే పెద్ద ట్విస్ట్‌. జనసేన పోటీ గురించి కథనాలు ఎన్ని వస్తున్నా నిజంగా  జరిగే వరకూ చూడాలనే రాజకీయ పార్టీలు మీడియా వర్గాలు భావించాయి. గతంలో అనేకసార్లు అనేక విషయాల్లో పవన్‌ కళ్యాణ్‌ ఆఖరి వరకూ నిర్ణయాలు నానబెట్టడం. చివరలో వెనక్కి తగ్గడం లేదా మొక్కుబడిగా సరిపెట్టడం పరిపాటి గనక ఈ పరిస్తితి ఏర్పడిరది.

ఆద్యక్షుడే ప్రధానమైన ఆ పార్టీలో ఆఖరి వరకు తన నోటి నుంచి మాట వచ్చే,వరకు విధానం మీద  తర్జనభర్జనలు జరుగుతుంటాయి. ఆయనే స్వయంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంగీకరిస్తుంటారు కూడా.   అయితే జిహెచ్‌ఎంసి ఎన్నిక విషయంలో పు సార్లు పోటీ చేస్తామని సంకేతాలిచ్చి ఆఖరులో వెనక్కి తగ్గడం   విధానపరమైన అస్థిరత్వాన్నే గాక గందరగోళాన్ని కూడా ప్రతిబింబించింది. ఇదే వైఖరి అయితే ఆ సూచనలు చేయకుండా వుండేవారు. పొత్తు చర్చ గురించి ప్రకటన చేసి ఉండేవారు కాదు. తమను ఏమాత్రం ఖాతరు చేయని బీజేపీ  రాష్ట్ర అద్యక్షుని తీరును ఆక్షేపించే ఉండేవారు.

అవేమీ లేకుండా ఆఖరి వరకు సాగదీసి చప్పున వెనక్కి తగ్గడం సందేహాలకు దారి తీస్తుంది. ఇంత ప్రహసనం ఎందుకు చేశారనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. బిజెపితో అధికారికంగా అడిగించుకుని ప్రకటిద్దామని పవన్‌ అనుకున్నారా? లేక మరేదైనా షరతును తీసుకురావాలనుకున్నారా? ఇంతా చేసి బండి సంజయ్‌ వెళ్లి చర్చలు జరిపింది కూడా లేదు. వచ్చిన ఇద్దరు నేతలు ఈ రాజకీయ సమరంలో కీలక పాత్రధాయిగానూ లేరు. పవన్‌ తన వ్యాఖ్యలో సంజయ్‌ పేరు ప్రస్తావించలేదు కూడా. దీన్నిబట్టి చూస్తే బిజెపిలో వర్గాల పరంగా ఈ విషయంలో వేర్వేరు వైఖరులున్నాయనుకోవాలా? తాము పోటీచేయబోమన్న పవన్‌కళ్యాణ్‌ ఒక్కఓటు కూడా పోకుండా బిజెపికేవేయించాని పిలుపునివ్వడం మరీ శ్రుతిమించిన వ్యవహారం కాదా?

జిహెచ్‌ఎంసిలోనే గాక భవిష్యత్తులోనూ తెంగాణలో ఇతర ఎన్నికలోనూ ఇదే తరహా సహకారం చూపించుకోవాలని అవగాహనకు వచ్చామని చెప్పడమంటే ఇలాగే పోటీ చేయకుండా బలపరుస్తుంటామని అర్థమా? మిత్రపక్షం అంటూనే జనసేన పట్ల బిజెపి వ్యవహరించిన తీరు ప్రజాస్వామికంగా వుందా?అకాలీదళ్‌ వంటిపార్టీలు బయిటకు వెళ్లిపోతుండగా ఎన్‌డిఎనే సంక్షోభంలో వుంటే జనసేన బిజెపికి ఇంతగా లోబడిపోవసిలన అవసరం వుందా? బిజెపిని గెలిపించడంద్వారానే హైదరాబాద్‌కు రక్షణ అని ప్రవచించిన జనసేనాని వారి హిందూత్వ నినాదానూ దుందుడుకు వ్యూహాలను నెత్తినెత్తుకోవడానికి సిద్ధపడటం లౌకిక సూత్రాకు విఘాతం కాదా?

బిజెపితో చెలిమి వల్ల ఎపిలోనూ జనసేన తికమక పడటం కనిపిస్తూనే వుంది. జిహెచ్‌ఎంసి ఎన్నిక చర్చకు ముందు మంగళగిరిలో తమ క్రియాశీల సభ్యులతో కసరత్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌ అమరావతి రాజధానిపైనా అయోమయ వ్యాఖ్యలే చేశారు. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలు వారి స్వంతమే తప్ప కేంద్ర బిజెపి ఆమోదం వున్నట్టు కాదని వారి వాదననే తనూ వల్లె వేశారు.అసలు రాజధాని మారుస్తున్నట్టు ఎవరు చెప్పారని  విచిత్రమైన ప్రశ్న వేశారు. ఆ విధమైన ప్రకటన వస్తే అప్పుడు పోరాటంలో జనసేనపాలు పంచుకుంటుందంటూనే ఎడతెగని పోరాటం వల్ల ప్రయోజనం వుండదని సందేహం వెలిబుచ్చారు.

గతంలో ఇదే సమస్యపై పరిపరివిధాల మాట్లాడిన జనసేన అధినేత ఈ విధంగా ఆ పోరాటంలో తాము క్రియాశీల పాత్ర వహించే అవకాశం లేదని విడగొట్టుకున్నారు. ఈ విధంగా ఎపి, తెంగాణ ఉభయ రాష్ట్రా రాజధానులోనూ పవన్‌ కళ్యాణ్‌ క్రియారాహిత్యాన్ని బిజెపి సమర్థనలను మార్గంగా ఎంచుకోవడం ఆయన భావి శైలికి ఒక సూచిక మాత్రమే. వీటి వెనక కేంద్రంతోనూ బిజెపితోనూ ఏదో అవగాహన వుందనే అనుకోవాలి. కాకుంటే తెలుగు నాట స్వతంత్రమైన స్పష్టమైన రాజకీయశక్తిగా జనసేనను  పెద్దగా పెంపొందించాని ఆయన అనుకోవడం లేదన్నదే వీటన్నిటిలోనూ పూసల్లో దారంలా కనిపించే పరమ సత్యం.