తెలకపల్లి రవి : ఇండియా ఇంగ్లీషూ!

తెలకపల్లి రవి : ఇండియా ఇంగ్లీషూ!

ఇంగ్లీషు గొప్పతనం గురించి మనం చాలా విన్నాం. వింటూనే వున్నాం. ఇంగ్లీషు పెత్తనం ఎక్కువైపోయి మాతృభాష దెబ్బతింటుందని ఆవేదన చెందేవాళ్లం కూడా గణనీయంగా ఉన్నాం. ఇంగ్లీషు నేర్చుకుని పైకొచ్చి మాకు ఆ అవకాశం లేకుండా చేస్తారా అని బహుజనుల ప్రతినిధులనే మేధావులు కొందరు ఆగ్రహిస్తుంటారు. అసలు మాతృభాష అన్న దృక్పథమే సెంటిమెంటు అని మరికొందరు మందలిస్తున్నారు.  నెల రోజుల్లో మీకు ఇంగ్లీషు మాట్లాడే ప్రావీణ్యం అలవరుస్తాం రమ్మని తామరతంపరగా ఎరిగిన స్పోకెన్‌ ఇంగ్లీషు కోర్సు నిర్వాహకులు ఆశ పెడుతున్నారు. మీడియా  కూడా యథాశక్తి ఇంగ్లీషు పదాలు గుప్పిస్తూ అవి లేకుండా తెలుగులోనే మాట్లాడ్డం సాధ్యం కాదన్న భావన కలిగిస్తున్నారు. ఒకరిద్దరు న్యాయమూర్తులు తెలుగులోనే తీర్పు ఇచ్చి అభినందనందుకుంటున్నారు.

అధికారులు కొంత ప్రయత్నం చేసిన సందర్భాలున్నాయి.  ఇదంతా భాషా రంగంలో జరుగుతున్న తర్జనభర్జననూ, భావపరమైన ఘర్షణనూ ప్రతిబింబిస్తుంది. ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం మాత్రమే వుంటుందని ప్రకటించాక ఈ చర్చ మరింత పెరిగింది. నిరసనల కేసు తర్వాత మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాలలు కొనసాగించాని, తెలుగులోనే చదువుకోవానుకునే పిల్లల కోసం అక్కడికి వాహన సదుపాయం ఏర్పాటు చేయాని నిర్ణయించింది. ఈ విషయమే సుప్రీం కోర్టులోనూ చెప్పారు. అక్కడ ప్రధాన న్యాయమూర్తి  ఎస్‌ఎస్‌బాబ్డే కూడా మాతృభాష ప్రాధాన్యత చెప్పినప్పుడు ఎపి న్యాయవాది విశ్వనాథన్‌ ఈ వాదన వినిపించారు గాని కోర్టు సంతృప్తి చెందలేదు. ఇంగ్లీషులో చదువుకోకపోవదం వల్లనే తాను కోర్టులో బాగా వాదించలేకపోతున్నాననన్నట్టు విశ్వనాథన్‌ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇంగ్లీషు మీడియంలో చదవని ఎందరో  రాణిస్తున్న ఉదాహరణలు చెప్పింది. 

భాషకు సంబంధించిన అనుకూల ప్రతికూల వాదనలు రెంటిలోనూ ఒక విధమైన యాంత్రికత కనిపిస్తుంటుంది. భాష సమానత్వం పట్ల, సామాజిక పాత్ర పట్ల, వాటి పెరుగుదలలోనూ స్తంభనలోనూ రాజకీయ పరిణామాల ప్రభావం పట్ల అవగాహన లోపించిన ఫలితమే ఇది. తెలుగును తేలిగ్గా చూసేవారేమో ఇంగ్లీషు సర్వస్వమైనట్లు దాన్ని నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు తథ్యమన్నట్లు గొప్పలు చెబుతుంటారు. తెలుగును కాపాడుకోవానేవారు ఆచరణ సాధ్యంకాని కొన్ని ప్రతిపాదనలు చేస్తుంటారు. తెలుగులో వత్తు, పొట్టలో చుక్క గురించి మాట్లాడితే ఛాందసమని ఈసడిరచేవాళ్లే ఇంగ్లీషు ఎలా మాట్లాడవచ్చో, ఎలా కూడదో గొప్ప పరవశంతో చెబుతుంటారు. 
 ఇంగ్లీషు గొప్ప భాష కనక దేశదేశాల పదాలను తనలో కలుపుకొని విస్తరించిందనే మాట తరచూ వింటుంటాం. అది నిజం కూడా. ఇవన్నీ చెప్పే డిక్షనరీ అన్న మాట కూడా ఫ్రెంచి నుంచే వచ్చిందట. అయితే అదంతా రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం నాటి మాట. అప్పట్లో మన సంపదూ సరిహద్దులు సంస్కృతులు వారిపెత్తనం కింద నలిగిపోయినప్పుడు వారి భాష మాత్రం దేశదేశాల పదాలతో విస్తరించింది. అయితే వాటిని ఎలా పలకాలో వాడే శాసించాడు. కడప, కాకినాడ, తిరుపతి వంటి తెలుగు పట్టణా పేర్లను వాడు తప్పుగా రాస్తే మాట్లాడలేమన్న అపహాస్యాన్ని భరించాం. ఇండియాలో ఎవరూ ఇంగ్లీషు మాట్లాడరు. హింగ్లీషూ, తెంగ్లీషూ, బెంగ్లీషూ అనే మాటు బాగా అలవాటైపోయాయి. అదే అమెరికా విషయానికొచ్చే సరికి దాన్ని అంగ్లీషు అని ఎవరూ ఎగతాళి చేయలేదు.

అమెరికన్‌ ఇంగ్లీషు అన్నారు. ఇంగ్లీషు వాళ్లు రాజకీయ ఆధిపత్యాన్ని తన కైవశం చేసుకున్న అమెరికా ఆంగ్ల భాషను కూడా ఇష్టానుసారం మాట్లడే హక్కు పొందడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి అమెరికన్‌ ఇంగ్లీషు నిఘంటువు విడిగా రూపొందిస్తుంటారు. భాషకు పెత్తనానికి ఉన్న సంబంధం ఇక్కడే తెలిసిపోతుంది. ఇప్పటికి ఇంగ్లీషులోకి అమెరికన్‌ ప్రయోగానే తప్ప ఇతర దేశాల వారి ప్రయోగాలను పెద్ద గౌరవంగా తీసుకోరట. ఎన్‌.ఆర్‌ఐ వంటి మాటలను కూడా ప్రామాణికంగా ఆమోదించరు. జ్యోతిసన్యాల్‌ అనే సీనియర్‌ జర్నలిస్టు స్టేట్స్‌మన్‌ రాసిన ‘‘ఇండీషు’’ పుస్తకం చదివితే ఇంగ్లీషుకు సంబంధించి ఆ భాషలో రాతకు సంబంధించి భ్రమలు చాలా తొలగిపోతాయి. ఇంగ్లాండును రెండు వంద ఏళ్లపాటు పాలించిన నార్మన్లు ఆ దేశస్తులపై ఫ్రెంచి, లాటిన్‌ భాషలను రుద్దాలని చూశారు. ఆంగ్లో శాక్సన్‌ పౌరులు భాషను ఈసడిరచారు. అందుకు నిరసనగానే  ఇంగ్లీషు భాషలో రాయడం ప్రారంభమైందని సన్యాల్‌ చెబుతాడు. ఈ క్రమంలో రాసినట్టు మాట్లాడాలా, మాట్లాడినట్టు రాయాలా అన్న చర్చ ఇంగ్లాండులో, మొత్తం ఐరోపాలో చాలా కాలం జరిగింది. ఇది మన వాడుక భాష, గ్రాంథిక భాష ఘర్షణ లాంటిది. తర్వాతి కాలంలో ఇంగ్లీషు విస్తరణ వాణిజ్య అవసరా మేరకు జరిగింది.

అదే సమయంలో ఇతర దేశాలపై రాజకీయ ఆధిపత్యం నిలుపుకోవాలన్న లక్ష్యమూ ఉంది. ఇవన్నీ ఇంగ్లీషు వాడకాన్ని ప్రభావితం చేశాయి. అందుకే ఈ క్రమంలో ఇంగ్లీషును శాసన భాషగా వాడటంలో చాలా ఛాందస ప్రయోగాలు, నివారించదగిన సంక్లిష్టతలు కొనసాగుతున్నాయని ఇంగ్లీషు వారూ, అమెరికన్లూ కూడా అనేకసార్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ఈ పుస్తకానికి సంపాదకుడైన మార్టిన్‌ కట్స్‌ లండన్‌లో జారీ అయిన అనేకఅధికారిక, వాణిజ్యపరమైన పత్రా నుంచి అలాటి తలతిక్క ఇంగ్లీషు ప్రయోగాలకు అనేక ఉదాహరణలిచ్చారు. ఇంగ్లాండులో చర్చిల్‌ నుంచి అమెరికాలో కార్టర్‌ వరకూ ఆంగ్ల భాషలో ఉత్తర్వులను సుభతరం, సుందరతరం చేయడానికి ఎన్ని సర్క్యుర్లు జారీ చేశారో అయితే ఇండియాలో ఇంగ్లీషు రాసే వాళ్లు చేసే తప్పుకు రెండు కారణాలు. ఇక్కడ ఇంగ్లీషు ప్రధానంగా వాణిజ్య పరమైన క్షణాతో పెరగడం ఒకటి. ఇంగ్లీషులో లేని అనేక క్షణాలు భారతీయభాషకు ముఖ్యంగా దక్షిణాది భాషకు ఉండటం రెండోది. ఉదాహరణకు ఇక్కడే, ఆయనే వంటి పదాలున్నాయి.

వీటికి సమానార్థకాలు ఇంగ్లీషులో లేవు. దాంతో అవసరం ఉన్నా లేకున్నా హిమ్‌సెల్ఫ్‌, ఇట్‌ సెల్ఫ్‌ వంటి పదాలు జోడిస్తున్నారు. రిగార్డింగ్‌, యాడెడ్‌, యాజ్‌ఫర్‌, యాక్సువల్లీ, డిఫినెట్లీ, వెల్‌, యునో, ఇన్‌వ్యూ ఆఫ్‌, ఆల్సో, యాజ్‌ గుడ్‌ యాజ్‌, బోత్‌ వగైరా చాలా ఉన్నాయి. ఈ పదాలలో కొన్ని భాష వ్యాకరణ సూత్రాకు సంబంధించినవైతే మరికొన్ని పదాలకు సంబంధించినవి. ఈ లోపాలు అనువాదాల సందర్భంలో చాలాసార్లు చెప్పుకుంటాముగాని అసలు ఆంగ్ల పత్రికలోనూ ఇవి ఉన్నాయనేది ఇక్కడ గమనార్హమైన విషయం. ఇలాంటివన్నీ జ్యోతిసన్యాల్‌ సోదాహరణంగా వివరించారు. ఇంగ్లీషులో దీర్ఘ వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు సహజమైనట్టు చెబుతుంటారు. కానీ చాలాసార్లు ఆ పత్రికలకు విషయం సూటిగా చెప్పకుండా దాటవేయడానికి అటూ ఇటూ తిప్పి చెబుతుంటాయి. చేతిలో కలం పట్టుకుని విడదీసుకుని గీతు గీసుకుని చూస్తే తప్ప అర్థంకాని వైనాన్ని సీనియర్‌ సంపాదకుడైన ఈ పుస్తక రచయిత చెబుతారు. స్ట్రింగర్లకు మనం చెప్పే పాఠం వంటివి చాలా ఉన్నాయి. భాష ఎక్కువతక్కువపై జుట్టు పీక్కోవడం కన్నా చారిత్రక దృష్టితో వ్యవహరించడం కీలకమని ఇవన్నీ చెబుతాయి. 
 ఇంగ్లీషుకు కొన్ని సదుపాయాలు ఉన్నమాట ఎంత నిజమో ఇతర భాషకూ వాటి గొప్పతనాు ఉన్నమాట అంతే నిజం. ఇంగ్లీషు నేర్చుకుంటేనే గొప్పవాళ్లమవుతామని, ఇంగ్లీషు వచ్చిన వాళ్ళంతా దాన్ని గొప్పగా ఉపయోగిస్తున్నారని అనుకోవడం పెద్ద పొరపాటు. అలా అనుకుని తెలుగునో మరేదాన్నో చులకనగా చూడటం ఇంకా పెద్ద పొరపాటు. కోట్లాది మందికి అక్షర జ్ఞానం లేని దేశంలో మాతృ భాష విద్యావికాసాలకు ప్రజాస్వీమీకరణకు తిరుగులేని సాధనమన్న ప్రాథమిక వాస్తవం గుర్తించినట్టు నటించడం మరీ పెద్ద పొరపాటు. మొదటి ఒక తరం భారతీయులకు ఇంగ్లీషు నేర్పి మనలాగా ఆలోచించడం నేర్పితే తర్వాత పని వారే చేసి పెడతారని మెకాలే చెప్పిన మాయాజాలానికి ఇప్పటికీ మన మేధావు కట్టుబడి ఉండటం అన్నిటికన్నా విడ్డూరం. ప్రైవేటు కాన్వెంట్లలో ఇంగ్లీషు మీడియం చదువుతున్నప్పుడు ప్రభుత్వమే ఎందుకు తెలుగు మీడియం   కొనసాగించాలనే వాదనదుర్బమైంది. ప్రైవేటు వారికి లేని బాధ్యత ప్రభుత్వానికి వుంటుంది.

అది ధర్మాస్పుత్రికీ కార్పొరేట్‌ ఆస్పత్రికి వుండే తేడా వంటిదే, కార్పొరేట్‌ బళ్లను ప్రజాస్వామీకరించేబదులు ప్రభుత్వ బళ్లను ఆ మార్గంలో మచానుకోవడం తలకిందు తర్కం. ఇంగ్లీషు మీడియం ఒక వాస్తవంగా అు్లకుపోయినప్పుడు దాన్ని వద్దని ఎవరూ చెప్పరు. అయితే ఆ పేరుతో తెలుగు మీడియం లేకుండా చేయడమే ఇక్కడ వివాదం. మండలానికి ఒక పాఠశా అంటే వుండే సాధకబాదకాలు  చెప్పనవసరం లేదు, ఎపి ప్రభుత్వం నిజానికి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలను చాలా బాగా తీర్చిదిద్దందని అందరూ మెచ్చుకుంటున్నారు,కాకపోతే కరోనా ఒకవైపు మీడియంపై సందేహాలు మరోవైపు సంధిగ్ధతకు దారితీశాయి. కేంద్ర నూతన విధానంలోనూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని వుంది. దేశంలో నగరాలోనే ఖరీదైన పాఠశాలో ఇంగ్లీషు చదువుకున్న వారు కూడా వాస్తవ పరిజ్ఞానం భాషాసామర్థ్యం అంతంతేనని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటీతోసహా ఎన్నోఅధ్యయనాలో తేలింది. కనీసం కింది తరగతువరకైనా తెలిసిన భాషలో చదువుకంటే  ఆ పైన అర్థం చేసుకోవడం తేలికవుతుంది. మమ్మీ డాడీ అంటే  ఫర్వాలేదు గాని బాబాయినిఏమంటారు తాతయ్యను ఏమంటారు వూరు అంటే ఏమిటి అని తెలుసు.  

పిల్లలు అడుగుతుంటే ఆ జాతి ఎలా అభివృద్ది చెందుతుంది? సత్యానాదెళ్లు  ఒకస్థాయిలో ఒకే గాని వాస్తవాభివృద్ధి ఈ గడ్డ మీద  అసంఖ్యాకులైన సామాన్య జనం వికాసంమీద ఆధారపడి వుంటుంది కదా?తెలుగు వికసించకుండా తెలుగు జాతి ఎలా వికసిస్తుంది?రాజ్యాంగం 345 నుంచి 350 వరకూ భాషకు సంబంధించి వున్నఅధికరణాలు ఏమవుతాయి? ఇంత చేసినా మనం ఇండ్లీషు మాత్రమే మాట్టాడగమనేది ఒప్పుకోక తప్పని కఠోర సత్యం. ఇంగ్లీషు అనేది అభ్యున్నతికి వీసా అనుకోవడం నిరాధార భ్రమ.అదీ ఒక సోపానంమాత్రమే.ప్రధాన న్యాయమూర్తి చెప్పినట్టు చైని జపాన్‌ ఫ్రాన్స్‌ వంటి దేశాలోనే ఇంగ్లీషు అక్కరకు రాదు. భారతీయుకు ఇంగ్లీషు ఎక్కువగా రావడం అనుకూలాంశమే, కాని మన దేశీయ భాషను తోసిరాజని అదే చానుకోవడం మాత్రం అశాస్త్రీయం.