తెలకపల్లి రవి: కోవిడ్‌19 సెకండ్‌ వేవ్‌-వాక్సిన్‌, మెడిసిన్‌, ఆక్సీజన్‌, హాస్పిటల్స్‌, లాక్‌డౌన్‌?

తెలకపల్లి రవి: కోవిడ్‌19 సెకండ్‌ వేవ్‌-వాక్సిన్‌, మెడిసిన్‌, ఆక్సీజన్‌, హాస్పిటల్స్‌, లాక్‌డౌన్‌?

 కోవిడ్‌19 కు గురైన భారత దేశ పరిస్థితిపై ప్రపంచ వ్యాపితంగానే ఆందోళన కలిగిస్తున్నది. మైక్రోసాఫ్ట్‌ సత్యనాదెళ్ల, గూగుల్‌ సుందర్‌ పిచాయ్‌ సహాయం ఒకటైతే వారు ఉపయోగించిన భాష ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. తొలి దశలో వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిసరుకు పంపించేందుకు నిరాకరించిన అమెరికా కూడా ఈ పరిస్థితి తీవ్రత చూశాక మార్చుకోక తప్పలేదు. దానికీ మనకూ మిత్రదేశాలుగా వున్న సౌదీ అరేబియా వంటివి కూడా సహాయం పెంచతున్నాయి. సింగపూర్‌ నుంచి ఆక్సీజన్‌ అందుతున్నది. చైనా కూడా సంసిద్ధంగా వున్నా మన మధ్య సంబంధాలు అందుకు ఆటంకమవుతున్నాయి. అయిదురోజుగా వరుసగా మూడున్నర లక్షల పాజిటివ్‌  కేసులు నమోదవుతున్న ఇండియా పరిస్థితిపై  ప్రపంచ మీడియా కూడా దృష్టి సారించింది. ఇందుకు మోడీ ప్రభుత్వ విధానాలు వైఫల్యమే కారణమని గార్డియన్‌,లీమాండే,మెయిల్‌ తదితర పత్రికలు రాస్తున్నాయి.ఏమైనా ఏదో రూపంలో  సహాయం  అందుతుండటం కొంత ఉపశమనం కలిగించే అంశం.
           దేశంలోని పదిరాష్ట్రాలే కరోనా కేసులు పెరుగుదలో 70 శాతానికి కారణమని కేంద్రం పరిశీలన చెబుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గాని పాలించే పార్టీలను గాని విమర్శించకుండా కోవిడ్‌పై పోరాటం  మీదనే కేంద్రీకరించాలని ఒకవైపున అంటూనే తాము ప్రతిపక్షంగా వున్న చోట విమర్శలు గుప్పించడం జరుగుతూనే వుంది. కేంద్రం రాష్ట్రాలపై ఆరోపణలు ఆపింది లేదు. ఆక్సీజన్‌ సరఫరా, వాక్సిన్‌ నిల్వలు ప్రతి విషయంలోనూరాష్ట్రాలు  చెప్పే వాటిని కేంద్రం తోసిపుచ్చడం చూస్తున్నాం. ఇప్పుడు వాక్సిన్‌ సరఫరా రేట్ల విషయంలో కూడా తీవ్రమైన గజిబిజి నెలకొన్నది. దేశంలో పదిశాతం కోవాక్సిన్‌ తొంభై శాతం కోవిషీల్డ్‌ ఇచ్చారు. మే1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ వాక్సిన్‌ ఇస్తామని విధానం ప్రకటించారు. నమోదు చేసుకోమని కూడా చెప్పారు. అయితే ఈ వాక్సిన్‌ సరఫరా గాని దాని ధరలు గాని స్పష్టత లేదు, ఇప్పటి వరకూ కేంద్రానికి మాత్రమే  నూటయాభై చొప్పున సరఫరా చేశారు. ఏప్రిల్‌ 30తో ఈ పరిస్థితి మారుతుంది. యాభై శాతం కేంద్రానికి ఇచ్చి మిగిలిన యాభైశాతంలో రాష్ట్రాలకూ ప్రైవేటు ఆస్పత్రుకు కూడా అందించేందుకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రాలకు 400,ప్రైవేటుకు 600 రేటు అవుతుందని  కోవిషీల్డ్‌ తయారీదారైన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. ఈ విధంగా భిన్నమైన రేట్లు ఏమిటని విమర్శలు వచ్చాయి. అంతేగాక కేంద్రానికి నూటయాభైకి ఇచ్చే అంశం అందులో లేకపోవడం అనుమానాలకు దారితీసింది. మొదటి విడత వరకే ఆ ఒప్పందం వర్తిస్తుందని సీరం ఇన్‌స్ట్టిట్యూట్‌ ప్రకటించింది.అంటే కేంద్రం కూడా 400 చెల్లించవసిందేననే అర్థం అందులో వుంది. కోవాగ్జిన్‌ అయితే ప్రైవేటుకు 1200రేటు ప్రకటించింది. ఈ రేట్లపై విమర్శలు వచ్చాక కేంద్రం  రెండు సంస్థకూ ధరలు తగ్గించవసిందిగా ఒక ప్రకటనలో కోరింది.వాటిస్పందన ఎలా వుండేది చూడాల్సిందే. రాష్ట్రాలకు తన వాటాలోని వాక్సిన్‌ను పూర్తి ఉచితంగా ఇస్తానని కూడా కేంద్రం చెబుతున్నది.  

ఆంధ్రప్రదేశ్‌ తెంగాణ కేరళ తదితర చాలా రాష్ట్రాలు కూడా అందరికీ ఉచితంగానే వాక్సిన్‌ ఇస్తామనిప్రకటించాయి.అయితే  ప్రభుత్వ ఆస్పత్రులో లేదా కేంద్రాలో ఎంతమందికి వాక్సిన్‌ అందుతుంది, ప్రైవేటుకు వెళ్తే ఎలా వుంటుంది ప్రైవేటు ఆస్పత్రులో సర్వీసు ఛార్జీలు  ఏమేరకు వుంటాయనేది కూడా  ఆచరణలో చూడవసి వుంటుంది. ఇది వేగంగా పూర్తయిపోతుందనుకోవడానికి లేదు.
               ఆక్సీజన్‌ కొరతతో పాటు  కోవిడ్‌ చికిత్సకు ఉపయోగిస్తున్న రెమిడిస్‌వేర్‌ లాంటి మందు దొరక్కపోవడం,బ్లాక్‌లో 20,30 వేల రూపాయలు అదనంగా వసూలు చేయడం రోగులకు వారి కుటుంబాలకు ప్రాణాంతకమవుతున్నది. పడకలు ఐసియు కొరత తీవ్రంగానే వుంది. ఈ విషయంలో ఆందోళన వద్దని పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు చూస్తున్న ప్రజలు అంత తేలిగ్గా వాటితో భరోసా పొందే అవకాశం  కనిపించడం లేదు.
               చివరగా అతిముఖ్యమైన లాక్‌డౌన్‌ విషయానికి వస్తే అది చివరి అస్త్రంగా వుండాని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. కాని లాక్‌డౌన్‌ పెట్టకపోతే కేసు ఇంకా అనేక రెట్లు పెరుగుతాయని అప్పుడు ఆస్పత్రు కొరత మరీ విషమిస్తుందని ఆందోళన ఒకవైపున వ్యక్తమవుతుంది. లాకౌట్‌పై తాను ఆదేశాలిస్తే రాష్ట్రాలను ఆదుకునే బాధ్యత పడుతుందని కేంద్రం తటపటాయిస్తున్నది.  ఎట్టకేలకు  పాజిటివ్‌కేసు పదిశాతందాటితే కఠిన చర్యు తీసుకోవాని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందంటున్నారు, అది మినీ లాక్‌డౌన్‌ విధించమని సూచించినట్టేనని మీడియాలో కథలు వస్తున్నాయిగాని కేంద్రం ఆ మాట వాడటం లేదు. తమకు  ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదనిచాలా  రాష్ట్రాలు ఇప్పటికీ చెబుతున్నాయి.గత అనుభవాల రీత్యా సంక్షేమ చర్యలు జోడిరచని లాక్‌డౌన్‌ వల్ల మేలుకన్నా కీడే ఎక్కువని అర్థమవుతుంది. ఇప్పటికికూడా పాతిక కిలోల బియ్యం ఇస్తామన్న మాట తప్ప ఇతర సహాయం గురించి కేంద్రం పెదవి మెదపడం లేదు. మే 2వ తేదీ అయిదు రాష్ట్రాల  ఎన్నికల ఫలితాలు వస్తాయి గనక ఆ తర్వాత లాక్‌డౌన్‌ అంటున్నారని  కొందరు పరిశీకులు అభిప్రాయంగా వుంది.వాక్సిన్‌ ప్రైవేటీకరణ కూడా  ఆ సమయంలోనే మొదలు కావడం యాదృచ్చికం కాదు. ఏమైనా సెకండ్‌ వేవ్‌ కోవిడ్‌పై పోరాటంలో భారత దేశం విజయం సాధించాలంటే మరింత సమగ్రమైన విధానం ప్రణాళిక అవసరమనడంలో సందేహం లేదు. కేంద్రం రాష్ట్రాలు కూడా స్పష్టమైన సమర్థమైన చర్యలు తీసుకుంటేనే  అది సాధ్యమవుతుంది.