తెలకపల్లి రవి :   నామినేటెడ్‌ గా నాలుగోసారి నవ్వుపాలైన నితిశ్‌ కుమార్‌

తెలకపల్లి రవి :   నామినేటెడ్‌ గా నాలుగోసారి నవ్వుపాలైన నితిశ్‌ కుమార్‌

బీహార్‌ ముఖ్యమంత్రిగా నాలుగోసారి నితిశ్‌ కుమార్‌  ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌డిఎలో  74 స్థానాలున్న బిజెపి 43 స్థానాలున్న జెడియుకు నాయకత్వం అప్పగించడంలోనే తలకిందులైన రాజకీయ పరిస్థితి తెలిసిపోతుంది. ఉప ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన సుశీల్‌ కుమార్‌ మోడిని మార్చేసి బిజెపి పక్ష నాయకుడైన తార్‌ కిశోర్‌ ప్రసాద్‌,  రేణుదేవిని ఇద్దరినీ  నియమించారు.

ఆ విధంగా  బిజెపి పాలిత రాష్ట్రాలో అనుసరిస్తున్న వరవడిని బీహార్‌లో తీసుకురావడం కూడా ఒక కొత్త సంకేతమే. నితిశ్‌ ఓడిపోయినా కూటమి ఈ మాత్రం స్థానాలు సాధించడంలో మహిళ ఓటర్లు ఆయనను బలపరచడం కారణమని పరిశీలనలు చెబుతున్నాయి గనక మొదటిసారి మహిళను ఉప ముఖ్యమంత్రిని చేశారు. మంత్రివర్గంలో ఏడుగురు బిజెపి వారుండగా అయిదుగురు జెడియు కు చెందిన వారు. ఇద్దరు చిన్న పార్టీ సభ్యులు. ఈ ఫలితాలతో నితిశ్‌ కుమార్‌ ఎన్‌డిఎలో జూనియర్‌ భాగస్వామిగా మారిపోయారనే అభిప్రాయం ఎంత సత్యమో ఈ మంత్రివర్గ కూర్పు తో తేలిపోయింది.

శాసనసభా పక్ష సమావేశంలో నితిశ్‌ ఈసారి ముఖ్యమంత్రి పదవి బిజెపి తీసుకోవాలని లాంచనంగా ప్రతిపాదించక పోలేదు, కాని బిజెపి వ్యూహాలు వేరే వున్నాయి. మేము ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నామని ఆయననే మళ్లీ ఎన్నుకున్నారు. ప్రధాని మోడీ పూర్తి సహకారం ఇస్తామని సందేశం పంపించారు. అయితే గతసారి నితిశ్‌ కుమార్‌ బిజెపిని వదలి పెట్టి లాలుతో జతకట్టినప్పుడు విజయం చేకూర్చిన వ్యూహకర్త ప్రశాంత కిశోర్‌ మాత్రం వదలి పెట్టలేదు, బిజెపి నామినేటెడ్‌ ముఖ్యమంత్రిగా మీకు శుభాకాంక్షలు అంటూ సందేశం పంపించాడు, అలసిసొలసిన పెద్దాయన మరో సారి పదవి చేపడుతున్నట్టు పేర్కొన్నాడు పికె.

మరో వంక తేజస్వి యాదవ్‌ నాయకత్వంలోని  ప్రతిపక్ష మహాఘట్‌ బంధన్‌ ఓట్ల లెక్కింపులో అవకతవకలకు నిరసనగా ప్రమాణ స్వీకారాన్ని  బహిష్కరించింది. చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జెపితో తిరుగు బాటు చేయించి బిజెపి తన విజయావకాశాలను దెబ్బతీసిందనే ఆగ్రహం నితిశ్‌కు వున్నా ముఖ్యమంత్రి పదవిని వదలి పెట్టలేని బహీనత ఆయనను తలవంచేలా చేసింది. ఆయన కలసి కాకపోతే బిజెపి పెద్ద పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అదే  ఆర్జేడీ పెద్ద పార్టీగా ఆ  అవకాశం పొందగలిగేది. ఆ అవకాశం ఇవ్వరాదనేది కూడా నితిశ్‌ ఆలోచన,దళితులు,అత్యంత వెనుకబడిన తరగతులు ఇంకా జెడియు బిజెపి ప్రభావం నుంచి బయటకు రాకపోవడం ఈ ఫలితాలకో  కారణం.

వామపక్షాలకు పునాది ఉన్నచోట వారిని సమీకరించగలిగినా మొత్తంపైన ఆ పరిస్థితి లేదు.జెడియు స్థానాలు తక్కువైనా నితిశ్‌ కుమార్‌నే ముఖ్యమంత్రిని చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడివున్నట్టు బిజెపి చెబుతున్నది. అయితే బలం లేకున్నా పదవి కోసం వేళ్లాడటంపై ఆపారీలోనే అసంతృప్తి వుంది. పెద్దపార్టీగా వచ్చిన తేజస్వియాదవ్‌ ఆర్జేడీని బలపర్చవసిందిగా కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌ నితిశ్‌కు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇవేవీ జరక్కపోయినా  ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ జూనియర్‌ భాగస్వామిగా బిజెపి దయతో ఆయన ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టాలి. 

2015లో ఆర్జేడీతో కలసి గెలిచి  మధ్యలో ప్లేటు ఫిరాయించి బిజెపితో కలసిన నితిశ్‌ అవకాశవాదం చెరిగిపోదు. బిజెపితో కలిసివుంటూనే  ఎత్తుగడగా ఎన్‌ఆర్‌పికి వ్యతిరేకంగా తీర్మానం చేయించిన నితిశ్‌ ఇప్పుడు హిందూత్వ ఎజెండాకు అక్షరాలా అమలు చేయవలసి రావడం అనివార్యం. . నితిశ్‌ కుమార్‌తో పాటు కాంగ్రెస్‌ ఈ ఎన్నికల ఫలితాతో బాగా అపహాస్యం పాలైంది. బీహార్‌లోనే గాక మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లోనూ గుజరాత్‌లోనూ కాంగ్రెస్‌నుంచి  రాజీనామాచేసి వచ్చిన  ఎంఎల్‌ఎలలోఅత్యధికులు విజయం సాధించడం బిజెపి ప్రభుత్వాలకు మరింత సుస్తిరత్వం కలిగించింది.

యుపిలోనూ 2 శాతం ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది.  మజ్లిస్‌ అయిదు స్థానాలు గెల్చుకోవడం మరో ముఖ్య పరిణామం. దానివల్ల ఘట్‌ బంధన్‌కు నష్టం కగలేదని చెబుతున్నా మతపరమైన విభజన పెంచిన బీజేపీ వ్యూహం నెరవేరడానికి దోహా పడిరది. బీహార్‌లోనే గాక భవిష్యత్తులోన బెంగాల్‌ తమిళనాడు ప్రతి చోటా తాము పోటీ చేస్తామని మజ్లిస్‌ నాయకుడు ఒవైసీ అనడం యాదృచ్చికం కాదు. మత రాజకీయా మతలఋ దీంతోనే తోస్తున్నాయి. బీహార్‌ శాసనసభలో సిపిఐ(ఎంఎల్‌)సిపిఎం సిపిఐకు సముచిత ప్రాతినిధ్యం ఉంటుంది.

కనుక సమస్య పరిష్కారంపై చర్చు కేంద్రీకరింపచేసి కుల మత రాజకీయాలకు పగ్గాలు వేసే ప్రయత్నం చేయగలుగుతాయి. అంతేగాక ఈ అనుభవంతో మిగిలిన చోట్ల  బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీలను ఐక్యం చేసే కృషికి వూతం కలగొచ్చు.ఈ నేపథ్యంలో నితిష్‌ కొంత కాలం పాటు స్తబ్దుగానే పాలన చేయవలసి వుంటుందని ప్రశాంత్‌ కిశోర్‌ అన్న మాటలు నిజం కావచ్చు అయినా సరే  ముఖ్యమంత్రిగా  ఆయన పూర్తి కాలం వుంటారా అన్నదానిపై అనుమానాలున్నాయి.ఇందుకు బిజెపి కుటి వ్యూహాలు ఒక కారణమైతే పెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీ అవకాశాలు మరో కారణం.