తెలకపల్లి రవి విశ్లేషణ : అయోధ్య రాముడిగుడి , మోడీ సందడి
తెలకపల్లి రవి
అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపనతో దేశంలో అత్యంత వివాదాస్పదమైన ఒక ఘట్టానికి భరత వాక్యం పలికినట్టేనా? రాముడిని తరతరాలుగా దేశంలో కోట్ల మంది పూజిస్తూనే వున్నారు. రామాయణ పారాయణం చేస్తున్నారు. వారివల్ల అప్పుడూ ఇప్పుడూ సమస్య లేదు. మతంపై ఆధారపడిన రాజకీయాలు గురించే చర్చ. అయోధ్య వివాదం పరస్పర అవగాహనతో గాని, కోర్టు తీర్పు ద్వారా గాని ముగిసిపోవాని ప్రతివారూకోరుకున్నారు. 1980వ దశకం మధ్య కాలంలో ఒకవైపున అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ నిర్ణయాలు మరోవైపున.. ఆరెస్సెస్ బిజెపి సంఘ్ పరివార్ వ్యూహాలతో ఈ సమస్యలు రాజకీయాల్లో కేంద్రస్థానంలోకి వచ్చింది.
1984లోరెండు సీట్లకు పరిమితమైన బిజెపి దాని ఆధారంగానే 82 సీట్లకు ఎదిగింది. విపి సింగ్ నాయకత్వంలో వచ్చిన లౌకికప్రభుత్వాన్ని కాంగ్రెస్‌తో కలిసి 1990లో కూల్చడానికి ఎల్‌కె అద్వానీ రథయాత్ర సాధనమైంది. అద్వానీ తదితరులు ప్రత్యక్ష నాయకత్వంలో కరసేవ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేయకుండా పివి ప్రభుత్వం ఆపలేకపోయింది. కలహాలతో దేశం తల్లడిల్లిపోయింది. కూల్చివేత నేపథ్యంలో.. బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు చాలావరకూ ఓడించారు. కానీ, వామపక్షేతర పార్టీలు మతతత్వ రాజకీయాలపై పోరాడకపోగా అధికారం కోసం బిజెపితో జట్టుకట్టాయి. అయినా 1996, 98, 99లో వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినా.. బీజేపీకి ఓట్లు మాత్రం 24 శాతంలోపే అవి తర్వాత 18 శాతానికి పడిపోయాయి. గుజరాత్లో గోద్రా అనంతర మత కలహాలు జరిగిన పదేళ్లకు ఆ రాష్ట్రముఖ్యమంత్రి మోడీ.. ప్రధానిపీఠమెక్కిన సమయంలోనూ బిజెపికి వచ్చింది 37శాతం ఓట్లు మాత్రమే. ఇవన్నీరాముడికీ రామాయణానికి సంబంధించిన అంశాలు కాదు. రాజకీయ భారతపర్వాలు . అందులో శంకుస్థాపనతాజాఘట్టం.
ఇన్నాళ్లకు రామ్‌లాలా తాత్కాలిక గుడారంలోంచి గుడిలోకి వస్తున్నారని మోడీ వూగిపోతూ మాట్లాడారు. తెలుగువారి భద్రాద్రి నుంచి అయోధ్యలోని ఇతర మందిరాల్లో కూడా రాముడు పూజలందుకుంటూనే వున్నాడు. రాజకీయగుడారంలో ఆయనను బందీని చేసింది బిజెపి ఆరెస్సెస్ నేతలే.
రాముడిని ఉత్తరాదిని మర్యాద పురుషోత్తముడంటారు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. మర్యాద అన్నా, ధర్మం అన్నా పద్ధతి. రాజ ధర్మం. ఇప్పుడు రాజులేరు గనక రాజ్యాంగధర్మం. ప్రభుత్వాధినేత మతక్రతువుల్లోఅధికారికంగా పాల్గొనరాదనేది లౌకిక రాజ్యాంగ ధర్మం. సుప్రీంకోర్టు తీర్పు ఆలయ నిర్మాణం కోసం ఒకప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి.. బాధ్యత దానికి అప్పగించాని చెప్పింది. కానీ, అయోధ్య వేడుకల్లో వేదికపై ప్రధాని మోడీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, యుపి సిఎం యోగి, గవర్నర్ ఆనందిబెన్ ఆసీనులయ్యారు. తీర్పుప్రకారం ట్రస్టుకు వదిలిపెట్టకుండా ప్రభుత్వాధినేతలు సంఘ్ సంచాలకులు తయారవడం ఆ స్పూర్తిని ఉ్లంఘించడమే. ట్రస్టు చైర్మన్‌గా వున్న నిత్యగోపాల్దాస్ బాబరీ.. విధ్వంసం కేసులో నిందితుడు. బాబరీ విధ్వంసం ఘోరమైన నేరమని చెప్పిన సుప్రీం కోర్టు.. దాని బాధ్యులైన వారికి శిక్ష విషయం వదిలేయడమే గాక వివాదస్థలాన్ని అవతలిపక్షానికి ఇవ్వడమే తీవ్ర విమర్శకు గురైనప్పటికీ ఏదో ఒక పరిష్కారం అని ప్రజల సర్దుకున్నారు. అద్వానీ వంటివారిని ఈసందర్భంలోదూరంపెట్టడానికి బిజెపి అంతర్గత కారణాలే చెబుతున్నాయి. గాని గత కళంకాముద్రనూ, న్యాయపరమైన చిక్కును తప్పించుకోవాలనే వ్యూహం అది. ఈ సమయంలో ప్రధాని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ అన్న రాముడి మాట ఉటంకించారు. అనేక మతాలు వారికి ఇది జన్మభూమి కదా, భారత మాత బిడ్డలందరూ హిందువులే కాదు కదా! రాజ్యాంగపరంగా మోడీ వారందరికీ ప్రధాని కదా! రాజ్యాంగ ధర్మాన్ని కూడా పాటించవద్దా? ఒకవేళ శంకుస్థాపనకు అధికారిక హోదాలో ప్రధాని హాజరయ్యేట్టయితే రేపు మరో గుడికి లేదా మసీదుకు చర్చికి గురుద్వారాకు కూడా వెళతారా? ఇదే వేడుకలోయుపి ముఖ్యమంత్రిని అయోధ్యలో మసీదు శంకుస్థాపనకు వెళతారా అనిఅడిగితే నన్నుపిలవరు నేను వెళ్లను అని జవాబిచ్చారట. ఆందోళన కరమైన మరో విషయలు ఇక కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత విస్తృతంగా నిర్వహించడం.
రాముడు ఈ దేశ సంసృతికి ప్రతీక అని ప్రధాని ప్రకటించారు. అలాంటప్పుడు బిజెపి వారికే ఉత్సవం ఎందుకు పరిమితమైంది? ఇతర పార్టీ వారినీ లేదా సంస్థ వారిని ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదు? హిందువు విశ్వాసం అన్నప్పుడు పరివార్ మాత్రమే మందిరనిర్మాణ బాధ్యత తీసుకోవాని కోర్టుచెప్పలేదే? కనుకనే కట్టేది రామ మందిరమా లేక బిజెపి ఆరెస్సెస్ దుర్గమా అని కొందరు పరిశీలకులు ప్రశ్న వేశారు. 370వ అధికరణం రద్దుకు ఏడాదిగడచినరోజునే అయోధ్య శంకుస్థాపన ముహూర్తం ఊరికే పెట్టలేదు. కాశ్మీర్‌ను, రాముణ్ని కూడా మేమే విముక్తి చేశామన్నది ఇక్కడ ప్రచారాస్త్రం. అయోధ్యలో బిజెపి పథకాలకు కాంగ్రెస్ ప్రచారం దోహదంచేస్తూనేవున్నారు. ఇప్పుడూ కాంగ్రెస్ తరపున రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ట్వీట్లు చేశారు. అత్యధిక ప్రాంతీయ పార్టీలకు బిజెపితో ప్రత్యక్ష పరోక్షభాగస్వామ్యం.
1998లోఈ ప్రక్రియను పెంచిన చంద్రబాబునాయుడు అమరావతిని అయోధ్యతో ముడిపెట్టిమాట్లాడారు. ఏపీ తెలంగాణ అధినేతకు సన్నిహితులైన స్వాములిద్దరూ అయోధ్య ఆహ్వానాలు అందుకున్నారు. వేడుకకు మోడీ హాజరవడాన్నివ్యతిరేకించిన మజ్లిస్ నాయకుడు ఒవైసీవంటి వారూ ఈ పార్టీ మిత్రులే. వామపక్షాలు, ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీ మేధావులు. మతరాజకీయాలను నిరంతరం వ్యతిరేకిస్తున్నా ఆ ప్రభావం పరిమితమై బిజెపి పట్టు పెరుగుతున్న మాట వాస్తవం. మోడీ హయాంలో వారిపై దాడులు పెరుగుతున్నాయనే విమర్శలున్నాయి. అయినా ఈ సమయంలోనూ అలాంటి గొంతు మూగబోయిందిలేదు. ఏతావాతా లౌకిక రాజ్యాంగాన్ని మత సామరస్యాన్ని కాపాడుకోవడం నేటి కీలక కర్తవ్యంగావుంది. త్వరలోయుపి, , బీహార్ ఎన్నికలు వస్తున్నకారణంగా ఇది మరింత తక్షణప్రాధాన్యత సంతరించుకుంటుంది. భిన్నమతాలకు విశ్వాసాలకు నియమైన ఈ దేశంలో మతవిద్వేషాలు కరోనావైరస్ కన్నా హానికలిగిస్తాయి. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా అయోధ్య కాండ ముగిసిపోవాంటే ప్రజలు పాలకులు మీడియా అప్రమత్తంగా వుండకతప్పదు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)