తెలకపల్లి రవి : పట్టు విడుపులతో "అపెక్స్‌" అడుగులు

తెలకపల్లి రవి :  పట్టు విడుపులతో "అపెక్స్‌" అడుగులు

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ అద్యక్షతన ఎపి తెలంగాణ ముఖ్యమంత్రు లు జగన్‌ కెసిఆర్‌లతో  జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సానుకూలంగానే  ముగియడం స్వాగతించదగింది. ఏపీ పునర్విభజన చట్టం తొమ్మిదవ భాగంలో నదీజలలా పంపిణీ, నిర్వహణ,విభజనకు సంబంధించిన నిబంధనలున్నాయి. అపెక్స్‌కౌన్సిల్‌ కూడా ఆ చట్టం ప్రకారమే ఏర్పడిరది. అలాగే  కృష్ణా గోదావరి నదీజలబోర్డు ఏర్పాటు కూడా జరిగింది.

ఏపీలోని పోతిరెడ్డి పాడుపై తెలంగాణ  అభ్యంతరాల నేపథ్యంలో మూడు సార్లు వాయిదా పడిన నాలుగేళ్ల తర్వాత జరిగిన అపెక్స్‌ సమావేశం నాలుగు అంశాను చేపట్టింది. మొత్తంపైన పరస్పర అవగాహనలతో వాస్తవిక దృక్పథంతోనే ముగిసిందని చెప్పాలి. పూర్తి వివరాలు వచ్చాక మరింత చర్చించుకునే అవకాశం వుంటుంది.  ఎన్‌టివి తెలుగు డాట్‌ కామ్‌ ప్రేక్షకులు చదువరులు  నాలుగు రోజు వెనక్కు వెళితే ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటారే గాని ఏదో పోట్లాడుకునేంత పరిస్థితి వుండదని చెప్పుకున్నాము. 

దేవుడితోనైనా పోట్లాడతానన్న కెసిఆర్‌ వ్యాఖ్య, రాజీ ప్రసక్తి లేదని ఏపీ స్పందనలు వచ్చిన నేపథ్యంలో చేసిన విశ్లేషణ అది. రెండు గంట సమావేశం ఆ అంచనాలను ధృవపర్చడం హర్షనీయమే. అలా అని విభేదాలు వివాదాలు పూర్తిగా తొలగిపోయాయనుకుంటే పోరబాటే. ఎప్పటికప్పుడు చర్చలు ద్వారా వాటిని పరిష్కరించుకుంటూ ప్రాజెక్టులతో జల వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవలసి వుంటుంది.

కేంద్రమంత్రి షెకావత్‌ అధికారికంగా చెప్పిన వివరాలు ప్రకారం పూర్తి ఏకాభిప్రాయం లేకున్నా ముందుకు సాగాలన్న భావన వ్యక్తమైంది. మొదటి అంశం  కృష్ణా గోదావరి నదీజబోర్డు పరిధి. విడిపోయిన రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ప్రాజెక్టులు వారిగా కాకుండా బేసిన్‌ వారిగా జరగాలన్నది కెసిఆర్‌ వాదన. ఒక దశలో బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్నప్పటికీ జలాలు వినియోగంలో రాష్ట్రాలు స్వేచ్చ ఉండాలంటే అదే మార్గమని ఆయన భావించారు.

అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తమకు పూర్తిగా అప్పగించాలని కూడా తెలంగాణ కోరుతున్నది. అయితే ఏపీ మాత్రం శ్రీశైలంనాగార్జున సాగర్‌ రెండిటినీ కృష్ణాబోర్డు నిర్వహించాంటున్నది. గోదావరి జలలా బోర్డు పరిధిపై ఏకాభిప్రాయం లేదు గనక కేంద్రం తానే నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. విభజన చట్టంలో కూడా అలాగే వుందని ఏకాభిప్రాయం తప్పనిసరి కాదని షెకావత్‌ స్పష్టం చేశారు.

పోతిరెడ్డి పాడు నీటి నిల్వ  సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరాలు అందుకు ప్రతిగా ఏపి ముందుకు తెచ్చిన సమస్య పూర్వరంగంలో కొత్త ప్రాజెక్టులు అనుమతి విషయమై చర్చ జరిగింది. కొత్తవాటిపై డిపిఆర్ లు సమర్పించి అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించిన తర్వాతనే ముందుకు సాగాలని కూడా ఈ సమావేశం నిర్నయించింది.  అయినా వివాదం వస్తే  అంతర్‌రాష్ట్ర నదీజల వివాద మండలి తేల్చాల్సి వుంటుంది.

ఈ క్రమంలోనే కృష్ణాజలాపై  ఉమ్మడిరాష్ట్రసమయంలో నియమించిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ స్తానంలో కొత్త ది వేయాలని తెలంగాణ  కోరుతున్నది. బ్రిజేష్‌ 2013లో ఏపికి 811 టిఎంసిలు మొత్తంగా కేటాయించగా  ఆ పరిధిలో తెలంగాణ ఏపీ మధ్య పంపిణీ సాగుతున్నది. ఏపీ ఉమ్మడిగా వున్నప్పుడే రాష్ట్రం దాన్ని వసాలు  చేసింది. అది తాత్కాలిక అవార్డులు కాగా పూర్తి అవార్డుకై ట్రిబ్యునల్‌ పనిచేస్తున్నది.

దాన్ని సాగించే బదులు కొత్తది వేయాని తెలంగాణ వేసిన కేసు సుప్రీం కోర్టు ముందుంది.అందుకే అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు కెసిఆర్‌ ఆ విషయం లేవనెత్తినపుడు కేసులు వెనక్కు తీసుకుంటేనే సాధ్యమని కేంద్రం చెప్పింది. ఆ మేరకు తమకు లిఖితపూరవ్వకంగా తెలిపితే కొత్త దాని విషయం ఆలోచించగమని పేర్కొంది. కెసిఆర్‌ అందుకు అంగీకరించారని ఉపసంహరణపై ఒకటి రెండురోజులో వర్తమానం పంపిస్తానన్నారని షెకావత్‌ వ్లెడిరచారు. అయితే ఆ తర్వాత కూడా కేంద్రం ఎలాటి నిర్నయం చేస్తుందనేది చూడాల్సిందే. మిగతా రాష్ట్రాలు దానికి ఒప్పుకుంటాయా అన్న ప్రశ్న కూడా రావచ్చు.

నాలుగో అంశం కృష్ణానది జలలా బోర్డు తరలింపు.ఉమ్మడి రాజధానిగా హైదరాబాదులోనే అప్పుడు గోదావరి కృష్ణా బోర్డు ఏర్పడ్డాయి. తర్వాత అమరావతి శంకుస్థాపన అక్కడి నుంచి పాలన మారింది. కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని అప్పట్లో భావించారు గాని అమలవలేదు. హైదరాబాద్‌ నుంచి కృష్నాబోర్డును  ఏపీ కి మార్చాని ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే ఎక్కడ అన్నది ఆ ప్రభుత్వం నిర్ణయించాల్సి వుంటుంది. 

ఇకపైన అపెక్స్‌కౌన్సిల్‌ సమావేశం ఏడాదికి ఒకసారైనా జరిపితే బాగుంటందని కేంద్ర మంత్రి అభిప్రాయాపడ్డారు. సమావేశం సృహృద్భావంతోజరిగిందని హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి విభాగం అధికారులు సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అదే సమయంలో గోదావరి కావేరి జలలా విలీనంపై ప్రశ్న దీనికి సంబంధించింది కాదని దాటేశారు, అయితే పోలవరం మాత్రం త్వరగా పూర్తికావాలని తాము కోరుకుంటున్నామని పనులు జరిగితే నిధులు విడుదలచేస్తామని ప్రకటించారు. 

కోవిడ్‌ కారణంగా పోలవరం చూడలేకపోయినా వీలవగానే  సందర్శిస్తానని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ  సమావేశంలో  ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఢీల్లీిలోని కార్యాలయం నుంచి పాల్గొనగా కెసిఆర్‌ హైదరాబాద్‌ నుంచి హాజరయ్యారు. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  నదీజలాపై కొత్త వివాదాలు వచ్చిన తర్వాత జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం  ఒక ముందడుగనే చెప్పాలి. అయితే ఏది కొత్త ప్రాజెక్టు ఏది కాదన్నది ఎడతెగని చర్చగానే వుంటుంది. నిర్మాణాలు వివాదాలు కూడా నడుస్తూనేవుంటాయి. ఈ సారి వర్షాలు బాగా పడిన కారణంగా అపారమైన జరాశులు సముద్రంలో కలిసి పోయాయి. ప్రతిదీ సాగదీసుకునే బదులు త్వరితంగా ఒప్పందాలకు వస్తే అందరికీ మంచిదే.