తెలకపల్లి రవి : స్థానిక రభసకు సుప్రీంతోనైనా  ముగింపు

తెలకపల్లి రవి :  స్థానిక రభసకు సుప్రీంతోనైనా  ముగింపు

` స్థానిక ఎన్నికలకు సంబంధించి  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ జారీ చేసిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం తీర్పు నిచ్చింది.  అంతకు ముందు సింగిల్‌ జడ్జి కొట్టివేసిన నోటిఫికేషన్‌ను ప్రధాన న్యాయమూర్తి అరూప్‌ కుమార్‌ గోస్వామితో సహా ధర్మాసనం ఇచ్చిన అనుమతించడం పెద్ద పరిణామమే. అయితే ఈ తీర్పుకు ముందు చేసిన వ్యాఖ్యలలో మాత్రం ధర్మాసనం ఎస్‌ఇసి నిమ్మగడ్డ తీరును కూడా విమర్శించింది. నేనుండగా ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం సిద్ధం కాదని ఆయన అన్నప్పుడు రాజ్యాంగ సంస్థలు సున్నితంగా విషయాలు చక్కపెట్టుకోవాలిగాని రాజకీయ పార్టీలా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించింది. ఇప్పుడు కూడా కోవిడ్‌ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వం ఎన్నిక సంఘం సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు జరపాలని సూచించింది. సహజంగానే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ అనీ, ఎదురుదెబ్బ అనీ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రతిపక్షాలు స్వాగతించాయి. తెలుగుదేశం మరో అడుగు ముందుకేసి న్యాయమూర్తులు మారినా న్యాయం మారదని కూడా వ్యాఖ్యానించింది.

 ఎస్‌ఇసి చెప్పిన ప్రకారమైతే ఫిబ్రవరి 5,9,13,17 తేదీలో నాలుగు దశలుగా ఎన్నికలు జరిగిపోవాలి. హైకోర్టు తీర్పుతో ఆ షెడ్యూలు వచ్చేసినట్టేనని  కొన్ని కథనాలు విడుదలైనాయి. అయితే  దీనిపై ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ కేసు ముగిస్తే గాని స్థానిక ఎన్నికలపై ఒక స్పష్టత రాదు. తాము ఎన్నికలో ఘన విజయం సాధిస్తాము గాని ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యమని ప్రభుత్వ సహాదారు సజ్జరామకృష్ణారెడ్డి స్పందించారు. గతంలో అనేక ములుపులు తిరిగిన ఈ కేసులో సుప్రీం కోర్టు మూడు రకాలుగా స్పందించే అవకాశముంది. మొదటిది` ఈ పిటిషన్‌ను తీసుకుని హైకోర్టు తీర్పుపై స్టే విధించడం. రెండు`పిటిషన్‌ను తిరస్కరించి ఎన్నికలు జరపాని చెప్పడం మూడు`మామూలుగా స్వీకరించి అందరికీ నోటీసులు జారీ చేయడం. అప్పుడు ప్రభుత్వం కొంత వ్యవధి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏదో విధంగా  ప్రభుత్వం స్థానిక ఎన్నికకు ప్రతిష్టంభన సృష్టించి నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసే వరకూ సాగదీస్తుందనే అభిప్రాయం టిడిపి తరఫున గట్టిగా మాట్లాడే ఒక న్యాయ నిపుణుడే ఈ రోజు వెలిబుచ్చారు. అది సాధ్యమా కాదా అనేది  సుప్రీం కోర్టు వైఖరిని బట్టి తేలిపోతుంది.
మామూలుగా ఎన్నిక నోటిఫికేషన్‌ ఒకసారి విడుదలైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవన్నది ఒక సూత్రం. ఇటీవల కేరళ ప్రభుత్వం వాయిదా కోరుతూ వెళ్లినపుడు కూడా సుప్రీం అదే చెప్పింది. అయితే ఇక్కడ గత నోటిఫికేషన్‌ వుందా లేదా  కొత్తది విడుదలై అములోకి వచ్చిందా లేదా అనేదానిపైనా వాదనలున్నాయి. అసలు  ఏకపక్షంగా కొత్తనోటిఫికేషన్‌ ఎలా విడుదల చేస్తారని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. 21వ తేదీనే సుప్రీం కోర్టు నుంచి ఏ స్పందన రాకపోతే 23 నుంచి ప్రక్రియ మొదవుతుందనేది ఒక అంచనా. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నిక కోడ్‌ అమవుతోందని నిమ్మగడ్డ చెప్పారు. అయితే ఆయన అనుకుంటే సరిపోదనీ, కోడ్‌ ఏదీ అమలులో లేదని మంత్రి పేర్ని నానీ స్పష్టంగా చెప్పారు. ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకించాయి. కొందరు కీలక అధికారులపై వేటువేసిన ఎస్‌ఇసి సిబ్బందితో సంభాషణలు జరిపారు.దీనంతటికీ తెర దించుతూ ఎన్నికలు జరగాంట ప్రభుత్వం ఎస్‌ఇసి కూడా సమన్వయంతో మెలగాల్సిందే. ఏదో విధంగా ఎన్నికు జరగాల్సిందే గనక దేశంలో చాలా చోట్ల జరిగాక గనక ముగించడమే మంచిది. అవసరం కూడా.