తెలకపల్లి రవి : ఎడతెగని వివాదాలతో ఏపీ స్థానికం ఎప్పుడో!

తెలకపల్లి రవి : ఎడతెగని వివాదాలతో ఏపీ స్థానికం ఎప్పుడో!

2021 ఫిబ్రవరిలో స్థానిక ఎన్నిక నిర్వహించనున్నట్టు  ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నిక కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రకటన చేయడం, అది సాధ్యం కాదని  రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చడం  మరోసారి వివాదాస్పద పరిస్తితికి దారి తీసింది.ఈ క్రమంలో ఎస్‌ఇసికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీం సహానీకి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రమే గాక గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ను కలసి ఫిర్యాదు చేయడం కోర్టుకు వెళ్లవచ్చనే సంకేతాలు ఇవ్వడం పరిస్థితిని పూర్తిగా మొదటికి వచ్చాయి. ఇందుకు తగినట్టే మంత్రి కొడాలి నాని ఒకటికి రెండు సార్లు చేసిన తీవ్ర వ్యాఖ్యులు, మరికొంతమంది మంత్రులు చీప్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి వంటివారు చేసిన విమర్శులు ఈ విషయంలో సఖ్యతకు అవకాశం లేదని స్పష్టం చేశాయి.

వివిధ వ్యవస్థ మధ్య వివాదాలు భిన్నాభిప్రాయాలు రావడం అసాధారణం కాదు గాని అవి ఎడతెగని విధంగా కొనసాగడం అరుదు. ఇందుకు కారకులెవరనే దానిపై ఎవరి అభిప్రాయం వారికి వుండొచ్చు గాని ఎస్‌ఇసి నిమ్మగడ్డసంయమనం పాటించకపోవడం,ఆయనవుండగా ఎన్నికు జరపవద్దనే వైఖరి జగన్‌ ప్రభుత్వం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణాు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను గత ప్రభుత్వం అది కూడా అప్పటి గవర్నర్‌ సిఫార్సుపై నియమించినప్పటికీ  కిందటి ఏడాది మొత్తం గాని,ఎన్నికల ప్రకటన తొలిదశ వరకు గాని పెద్ద సమస్యలేమీ లేకుండా గడచింది. కాని మార్చిలో ప్రకటించిన ఎన్నికలను  కరోనా కారణంగా చూపి ప్రభుత్వంతో సంప్రదించకుండా కనీసం తెలియజేయకుండా వాయిదా వేయడంతో ఆయన వివాదానికి అంకురార్పణ చేశారు.

ఎన్నిక నిర్వహణ ఎస్‌ఇసి ఆధ్వర్యంలో జరగడం నిజమే అయినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం యంత్రాంగం తప్పనిసరిగా కావాలి. పైగా నియామకం కూడా రాష్ట్రమే చేస్తుంది. అలాటప్పుడు కనీసం ముఖ్యమంత్రికి తెలియకుండా ఎన్నికు వాయిదా వేయడం అనూహ్యమైన విషయం. దానిపై ముఖ్యమంత్రి జగన్‌ స్పందనలో సామాజిక ప్రస్తావన పొరబాటైనా ఆగ్రహావేదనల్లో అర్థంవుంది. తర్వాత సుప్రీంకోర్టు కూడా వాయిదాను సమర్తిస్తూనే  ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పట్టింది, ఈసారి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి అడుగులు వేయాలి అని ఆదేశించింది. సరే తర్వాత ప్రభుత్వం ఎస్‌ఇసి పదవీ కాం కుదించి నిబంధను సవరించి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించి భంగపడిన మాట నిజమే. ఈ సమయంలో నిమ్మగడ్డ వ్యవహరించిన తీరులోనూ పొరపాట్లు ఉన్నాయి.

స్వీయ పునర్నియామకం,పార్క్‌ హయత్‌ ప్రహసనం వాటిలో పెద్దవి.ఆయితే హైకోర్టు  అయితే హైకోర్టు ఆదేశించిన మీదట సుప్రీం హెచ్చరించిన మీదట ప్రభుత్వం నిమ్మగడ్డను పునరుద్ధరించిన తర్వాత కూడా వివాదాలు కొనసాగడమే అవాంఛనీయ పరిణామం. తదుపరి ఎన్నిక నిర్వహణపై  ప్రభుత్వాన్ని సంప్రదించి అడుగేయవసిందిగా సుప్రీం కోర్టు స్పస్టంగా చెప్పినా నిమ్మగడ్డ అందుకు సిద్ధం కాలేకపోతున్నారు. ఈ కాలం లో రెండు మూడు సార్లు హైకోర్టుకు వెళ్లారు, ఇతరులు వేసిన కేసులోనూ అఫిడవిట్లు దాఖలు చేశారు. ప్రభుత్వంతో మాట్లాడకుండానే ఎన్నికపై అఖిలపక్షం వేసి విడివిడిగా మాట్లాడారు. ఈ తరుణంలోనే ప్రభుత్వ కార్యదర్శి  ఒకరి నుంచి తనకు లేఖ వచ్చిందంటూ లీక్‌ చేశారు. ఆ సమావేశాన్ని పాలక వైసీపీ వ్యతిరేకించి బహిష్కరించినా, హాజరైన పార్టీలో సిపిఎం కాంగ్రెస్‌ వంటివి కొన్ని విభిన్నమైన సూచనలు చేసినా  ఏకాభిప్రాయం వచ్చిందని తనకు తనే క్రోడీకరించి కోర్టుకు తెలియజేశారు.

అఖిలపక్షం తర్వాత ఇన్నాళ్లకు  అకస్మాత్తుగా ఫిబ్రవరిలో ఎన్నికలంటూ పత్రికకు ప్రకటన విడుదల చేసి ప్రభుత్వానికి పంపించారు. అందులో గత నోటిఫికేషన్‌ సంగతి ప్రస్తావించకుండా పూర్తిగా  కొత్త షెడ్యూల్  అన్నసూచనలు ఇచ్చారు. వాస్తవానికి ఆ సమయంలోనే  ప్రభుత్వం సహకరించడం లేదని గవర్నర్‌కూ లేఖ రాసినట్టు కనిపిస్తుంది, కరోనా సమస్య ఉద్యోగులు సిబ్బంది ఆ విధులలో నిమగ్నమై ఉండటం కారణంగా ఎన్నికలు సాధ్యం కాదని ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.  అందువల్ల కలెక్టర్లతో సమావేశం కూడా అవసరం లేదని సూచించారు. ఆ విధంగా రాయడమే  తన రాజ్యాంగ అధికారాల ఉ్ఉల్లంఘన అని ఎస్‌ఇసి ఆగ్రహించడం  ఆశ్చర్యం కలిగిస్తుంది.

తుది నిర్ణయం తానే తీసుకోవచ్చుగాని సంప్రదించడం సమన్వయం చేసుకోవడం అంటే భిన్నాభిప్రాయాలు చర్చలు జరిపి ఒక  నిర్ణయానికి రావడమే కదా. వైసీపీ నేతూ మంత్రులు మాట్లాడే తీరుపై అభ్యంతరాలున్నా ప్రధాన కార్యదర్శిని  అధికార యంత్రాంగాన్ని అయినా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా? ఇక్కడ ఆ వాతావరణమే లోపించింది,  బీహార్‌ ఎన్నిక నుంచి జిహెచ్‌ఎంసి వరకూ ఆయన ప్రస్తావించినా  ఏ  రాష్ట్రం అనుభవం పద్ధతి వారిదని  ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సమాధానం కాదనలేనిది. ఫిబ్రవరిలో ఎన్నికలంటూ నవంబరులో ప్రకటించడం కూడా వ్యూహాత్మకంగా చేసినట్లు కనిపిస్తుంది.

అప్పటికి ఏది ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఇంత ముందే ఎలా నిర్ణయించగరు? నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హయాంలో స్థానిక ఎన్నికు వుండరాదనే వైఖరితో ప్రభుత్వం వున్నట్టు స్పష్టమైపోయింది, మళ్లీ కోర్టు ద్వారా ఉత్తర్వు తెచ్చుకోవాలని నిమ్మగడ్డ భావిస్తుండవచ్చు గాని ఫిబ్రవరి నాటికి ఆయనకు అంత వ్యవధి ఉండకపోవచ్చు. సిఎస్‌ సమాధానం తర్వాత కలెక్టర్ల సమావేశం రద్దు చేసుకోవడం వాస్తవ పరిస్తితిని తెలియజేస్తుంది. ఒకవేళ కోర్టుకు వెళ్లినా వాయిదాలు విచారణలతో  పుణ్యకాలం కాస్తా అయిపోవచ్చు,