తెలకపల్లి రవి: ఏపీ రాజధాని ఇప్పట్లో తేలదు     

తెలకపల్లి రవి: ఏపీ రాజధాని ఇప్పట్లో తేలదు     

ఆంధ్రప్రదేశ్‌ పాలనా రాజధాని ఉగాదికి విశాఖకు తరలిపోవడం తథ్యమని మంత్రులు, వైసీపీ నాయకులు పలువురు ప్రకటనలు చేశారు. కాని ఇంతవరకూ ఆపని  జరగలేదు సరికదా ఆ దిశలో కదలికలు కూడా లేవు. ఎంపి విజయసాయి రెడ్డి , మంత్రి అవంతి శ్రీనివాస్‌ వంటివారు అవకాశం దొరికినప్పుడల్లా రాజధాని వస్తుందని చెబుతూనే వున్నా తక్షణ తరలింపు ప్రక్రియ ఆగిపోయిందనేది అర్థమవుతున్న విషయం, ప్రస్తుతానికి ఆ  ఆలోచనను వాయిదా వేసినట్టు కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. హైకోర్టులో అమరావతి రాజధానికి సంబంధించిన కేసు విచారణ ఇప్పట్లో తేలేలా లేదు గనక ముఖ్యమంత్రి జగన్‌ ఈ మేరకు సమయం తీసుకోవాలని నిర్ణయించారనేది ఆ కథనం సారాంశం. అయితే గతంలో తరలింపు గురించి చెప్పినప్పుడు కూడా కోర్టులో స్పష్టత వస్తుందనే నమ్మకం ఏమీ లేదు. దాంతో నిమిత్తం లేకుండా సాధారణ కార్యాలయా లఏర్పాటు కిందనే రాజధాని మార్పు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా వుండినది, అయితే తాజా సూచననుబట్టి చూస్తే దాన్ని కూడా ప్రస్తుతం వదులుకున్నట్టు కనిపించాలనేది ప్రభుత్వ వ్యూహంగా గోచరిస్తుంది. దీనికి స్పష్టమైన కారణాలు మాత్రమే గాక రాజకీయ ఎత్తుగడ కూడా వుంది.
          గతంలో హైకోర్టు రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ ప్రారంభించింది. ఢల్లీి నుంచి సీనియర్‌ లాయర్లు వచ్చి వాదను వినిపించారు. రైతులతో పాటు టిడిపి నాయకులు ప్రజాప్రతినిధులు పలువురు కేసు వేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జె కె మహేశ్వరి నాయకత్వంలోని ధర్మాసనం త్వరితంగా విచారించి అనుకూలమైన తీర్పు నిస్తుందనే ఆశాభావం వారిలో వుండినది. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమంత్రి హైకోర్టుపై లేఖ రాయడం, తర్వాత జెకెమహేశ్వరి సిక్కింకు బదలీ కావడం,జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ పదవీ విరమణ, అరూప్‌ గోస్వామి ప్రధానన్యాయమూర్తిగా రావడం వాతావరణంలో కొంత మార్పు తెచ్చింది. రాజధాని కేసు విచారణ ఆగిపోయింది. స్థానిక ఎన్నిక వంటి అంశాలో ప్రభుత్వవాదనకు అనుకూంగా కూడా కొన్ని తీర్పు వచ్చాయి.ఈ స్థితిలో ప్రభుత్వ న్యాయవాదులే రాజధాని కేసు విచారణ  ఎప్పుడు చేపబడతారని వెంటబడటం ప్రారంభించారు. రాజధాని మార్పునకు అనుకూలంగా వేసిన పిటిషన్లను కూడా విచారణ చేపట్టాలని వారు కోరారు. మరోవైపున పిటిషనర్లు వ్యయ ప్రయాసలు జాప్యం కారణంగా మరింత భారం మోయడానికి తటపటాయిస్తున్న పరిస్థితి. చివరకు హైకోర్టు   సిజె గోస్వామి మే3వ తేదీ నుంచి రాజధాని కేసు పునర్విచారణ చేపడతామని ప్రకటించారు. కాకపోతే గత ధర్మాసనంలో జస్టిస్‌ జయసూర్యతప్ప అంతా మారిపోయారు గనక మొత్తం విచారణ మళ్లీ మొదటి నుంచి చేస్తామని చెప్పారు. అంటే పత్రాలు సాక్ష్యాలు పున:సమర్పించాల్సి వుంటుంది. మళ్లీ మొదలు కావడం అంటే పరిణామక్రమం ఎంత కాలం ఎలా నడుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ లోగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌విరమణ బాధ్యతలు స్వీకరించడం మరో ముఖ్య పరిణామం కాబోతుంది.
                   మే3న విచారణ పున:ప్రారంభం అన్నప్పటికీ కొద్ది రోజుల్లోనే వేసవి సెలవులు వస్తాయి. మరోవంక కరోనా  సెకండ్‌ వేవ్‌ హైకోర్టును కకావికం చేసింది. కనుక జూన్‌ తర్వాత గాని ఈ కేసుపై గట్టిగా వేగంగా విచారణ జరగకపోవచ్చని న్యాయ వర్గాలు  అంచనా వేస్తున్నాయి. అప్పటి నుంచి ఎంత లేదన్నా మరో నాలుగైదు నెలలు ఆ తర్వాత తీర్పుపై  ఎవరో ఒకరు సుప్రీం కోర్టుకు వెళ్లడం వంటివి జరగడం సహజం. ఈ విధంగా చూస్తే 2022 వరకూ రాజధానిపై  ఖచ్చితమైన న్యాయస్తానాలు ఆదేశం రాకపోవచ్చు.
           ఈ పూర్వరంగంలోనే జగన్‌ ప్రభుత్వం విశాఖ తరలింపును వాయిదా వేసి అమరావతిలోనే ఏదో చేసినట్టు కనిపించాలనే వ్యూహం చేపట్టింది. మూడు వేల కోట్ల రుణాలు తెచ్చి అవసరమైన పనులు పూర్తి చేయడం మంగళగిరి తాడేపల్లి మునిసిపాలిటీలు కలిపి విజయవాడ కన్నా పెద్ద కార్పొరేషన్‌గా మార్చడం ఇవన్నీ అందులో భాగాలే.  చంద్రబాబు గతంలో మాటు చెప్పి వదలేస్తే మేమే అభివృద్ధి చేస్తున్నామని మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు కూడా. కోర్టు తీర్పు కోసం సమయం ఇచ్చినట్టు మరో వంక అమరావతిలో కొంత సానుకూత పెంచుకున్నట్టు వుండానే జగన్‌ ప్రభుత్వం విశాఖ తరలింపును ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు అర్థమవుతుంది. అయితే మౌలికంగా ఆ ప్రభుత్వం విధానంలో మార్పు వుండదు.