తెలకపల్లి రవి విశ్లేషణ:  ఏపీ హైకోర్టులో బహువిధవివాదాలు

తెలకపల్లి రవి విశ్లేషణ:  ఏపీ హైకోర్టులో బహువిధవివాదాలు

ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలో న్యాయసంబంధమైన వివాదాలు ,భాషణలు వ్యాఖ్యానాలు  మరోసారి తీవ్ర రూపం దాల్చాయి.చూస్తూ వుంటే ఇవి ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కూడా లేవు. ఈ వారం  రాజధాని కేసును సమగ్రంగా విచారణ చేపట్టడం, న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు, సోషల్‌ పోస్టు కేసు, శాసనసభ మండలి చర్చలు, క్యాంప్‌ ఆఫీసు, విశాఖ గెస్ట్‌హౌస్‌ నిర్మాణం, ఇళ్లస్థలాలు వంటి అంశాలన్నీమరోసారి ముందుకొచ్చాయి. రాజధాని విషయంలోనూ మధ్యంతర ఉత్తర్వులు  స్టేలు ఇచ్చే అంశానికి సంబంధించినవి మొదటతేల్చి తర్వాత ప్రధాన సమస్యలోకి వెళ్లాలని ధర్మాసనం నిర్ణయించింది. 240 పైన వున్న ఈ పిటిషన్లను వర్గీకరణ ప్రక్రియ ప్రస్తుతం సాగుతున్నది. సోమవారం మళ్లీ విచారణ మొదలైన తర్వాత కూడా ఎన్ని పిటిషన్లు పూర్తవుతాయన్న ప్రశ్న వుండనే వుంటుంది.  ఈ లోగా స్టేటస్‌కో ఎత్తివేయాని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం కోరినా కోర్టు అంగీకరించలేదు. మరోవైపున అమరావతి రైతులే గాక రాయసీమ ఉత్తరాంధ్ర నుంచి ప్రభుత్వానికి అనుకూంగా  సిఆర్‌డిఎ రద్దు చట్టాన్ని బలపరుస్తూ దాఖలైన పిటిషన్లను కూడా అనుమతించింది. అమరావతి ఒక్కటే గాక తమ ప్రాంతాలన్నీ అభివృద్ది కావాలని వారు వాదనలు  వినిపించే అవకాశముంటుంది. ఇదే క్రమంలో శాసనసభ చర్చ నిర్ణయాలు, మండలిలో చర్చ తీరు వంటివాటి వివరాలు సీల్డు కవరులో  సీడీలో ఇవ్వాలని సభ కార్యదర్శిని ఆదేశించింది. అయితే మండలి రద్దుకూ రాజధాని కేసుకు సంబంధం లేదని ఒక దశలో వ్యాఖ్యానించింది.విశాఖలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణం స్టేటస్‌కో ఉల్లంఘన అంటూ దాఖలైన పిటిషన్‌ను తర్వాత స్వీకరించనుంది.అలాగే సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మాణంపైనా ప్రశ్నలు నడిచాయి. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే  పని చేసుకోవడానికి క్యాంప్‌ ఆఫీసు  వుండొచ్చని చంద్రబాబు హయాంలోనూ హైదరాబాదుతో పాటు ఆయన స్వగ్రామమైన నారావారిపల్లెలో క్యాంపు ఆఫీసు నడిచిందని ఎజి వివరించాక కౌంటర్‌ దాఖలు  చేయవసిందిగా కోర్టు ఆదేశించింది.రాజధానిలో ఇళ్లస్థలాల  కేటాయింపును మాత్రం వేరే కేసుగా పరిగణించి  వాయిదా వేసింది. అమరావతి అక్రమాలపై దర్యాప్తు జరగకుండా  హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాని కోరుతూ తాము వేసిన ఎస్‌ఎల్‌పిని విచారణతేదీ నిర్ణయించకపోవడంపై  రాష్ట్ర ప్రభుత్వం  తరపున సుప్రీం కోర్టుకు  లేఖ రాయడం మరో పరిణామం. ఇలా అనేక కోణాల్లో రాజధాని  సమస్య రాజకీయంగా న్యాయపరంగా మధనం జరుగుతుండగా ప్రధాని మోడిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలుసుకోవడం కేంద్ర మద్దతుకు  పరోక్ష సంకేతం అనే అభిప్రాయంవుంది.
           రాజధాని కేసును మించి రాజకీయ వ్యాఖ్యలు వివాదాలు  వాతావరణం వేడెక్కిస్తున్నాయి. న్యాయవ్యవస్థపైన మంత్రలు పాలకపార్టీ పెద్దలు  చేసిన వ్యాఖ్యలపట్ల అభ్యంతరం ప్రకటిస్తూ పార్లమెంటులో హైకోర్టు మూసి వేయమని అడగండని జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపున సోషల్‌ మీడియాలో   కోర్టుకు వ్యతిరేకంగా వచ్చిన పోష్టు పెట్టిన వారిపైనా  బయిట రాజకీయ వ్యాఖ్యు చేసిన వారిపైన కేసు నమోదు చేయాల్సిందిగా ఇదివరకే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. నిన్న మళ్లీ ఇదే అంశం ఎపి హైకోర్టులో బహువివాదాలు  వచ్చినప్పుడు గత వారం  తరహాలోనే హైకోర్టుపై యుద్దం ప్రకటించినట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వం పేదల కోసంచేసే నిర్ణయాలకు కోర్టు అడ్డు తగిలితే తిరుగుబాటు రావచ్చని స్పీకర్‌ చేసిన వ్యాఖ్యకు ఇది ప్రతిస్పందన. శాసనసభ, హైకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవే, రాజ్యాంగం 211 అధికరణం ప్రకారం కోర్టు పనిని సభ చర్చించకూడదు(నిబంధన ప్రకారం జడ్జిను అభిశంసించే సందర్భంలో తప్ప) అలాగే 212 ప్రకారం సభ పనిని ఆదేశాలను కోర్టు ప్రశ్నించకూడదు. చేసిన శాసనాలు రాజ్యాంగ మౌలిక స్వభావానికి అనుగుణంగా వున్నాయా లేదా అని మాత్రం సమీక్షించవచు,226వ అధికరణం ప్రకారం హైకోర్టు రిట్‌ఆఫ్‌ మాండమస్‌, హెబియస్‌ కార్పస్‌, కో వారంరోప్రొహిబిషన్‌ తదితర పిటిషన్లను తీసుకుంటుంది. 32వ అధికరణ ప్రకారం సుప్రీం కోర్టుకున్న అధికారాలకు లోబడి తన పరిధిలో ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వొచ్చు. 78వ అధికరణం, ఎపి శాసనసభ నియమావళిమేరకు సభాపతి సభా నిర్హహణలో సర్వాధికారాలు కలిగివున్నా చేసిన శాసనాలపై సమీక్షను ఆక్షేపించడానికి లేదు. ఇక్కడే స్పీకర్‌ తమ్మినేని  వ్యాఖ్యలు  అభ్యంతరకరంగా మారాయి.అయితే అవి కోర్టు ధిక్కారమవుతాయా అన్నది చర్చనీయమే.సోషల్‌ పోస్టుపై కేసు పెట్టకపోవడమే గాక స్పీకర్‌, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపి విజయసాయి రెడ్డి వంటివారిని ఉపేక్షించడం కోర్టు కోపానికి కారణమైంది.ఇలా అయితే సిబిఐని దించాల్సి వస్తుందని న్యాయమూర్తలు అన్నదానికి అడ్వకేట్‌ జనరల్‌ కూడా అభ్యంతరం లేదన్నారు. ఇది గాక గతంలో జడ్జి పోన్ల ట్యాపింగ్‌ కథనాలకు సంబంధించిన కేసు వుంది. ఆ వార్త ప్రచురించిన పత్రికకు తాము లీగల్‌ నోటీసు ఇచ్చామని  ఆ పిటిషన్‌నుతిరస్కరించాలని ప్రభుత్వం కోరుతున్నది. ప్రభుత్వ అడ్వర్టయిజ్‌మెంట్ల విడుదలపై ఆరోపణతో పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి కూడా టిడిపి బినామీ కనక దానికీ విచారణార్హత లేదన్నది.సాక్షిలో వార్తపై సిజె జెకెమహేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆంధ్రజ్యోతిలో కథనాలపై మరో న్యాయవాది ప్రస్తావన చేశారు. అయితే అది మరో కేసులో విచారిస్తున్నందున తాము స్పందించబోమని సిజె అన్నారు.
            ఈ విధంగామొత్తంపైన చూస్తే ఎపి రాజకీయాలు  ఎడతెగని కోర్టు వాజ్యాల్లో  చిక్కుకుపోయినట్టు స్పష్టమవుతుంది,ఏతావాతా ఈ ఏడాదిలో రాజధాని కేసు ముగియకపోవచ్చని స్పష్టమమవుతున్నది. ఆ తర్వాత ఏదో ఒక పక్షం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుంది గనక మరింత జాగు తప్పదు. ఈ ప్రతిష్టంభన ప్రజా సమస్యలపై పరిపాలనా సమర్థతపై దృష్టి కేంద్రీకరించడానికి అవరోధంగా మారుతున్నది. అసహన వ్యాఖ్యలు పరిస్తితిని ఇంకా దిగజారుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమకు కోర్టుపై అమితమైన  గౌరవం వుందని ప్రకటిస్తూ న్యాయమూర్తలు కూడా సంయమనం పాటించాలని కోరారు. సోషల్‌ మీడియాలో జరిగేవాటిని ఎలా అరికట్టాలో న్యాయమూర్తులే చెప్పాలని కూడా కోరారు. ఎజి శ్రీరాం కూడా కొంత సర్దుబాటు స్వరమే వినిపించారు.వీటిని బట్టి ప్రభుత్వం న్యాయవివాదాలపై కసరత్తు కొంత పెంచిందనే అభిప్రాయం కలుగుతుంది. కాని ఎప్పుడు ఏ వైపు నుంచి ఏవ్యాఖ్యలు వస్తుందో చెప్పలేని స్థితి.
             ఈ న్యాయ మీమాంసలో కొసమెరుపు స్థానిక ఎన్నికలు, రాష్ట్ర  ఎన్నికల  కమిషన్‌ మళ్లీ తెరపైకి రావడం.గతంలో కరోనా కారణంగా  ప్రభుత్వానికి తెలియకుండా ఎన్నికలు వాయిదా వేయడం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో వైరుధ్యానికి బీజం వేసింది.ఇప్పుడు దేశంలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతుంటే స్థానిక ఎన్నికలు ఎందుకు జరపడం లేదని ఒక న్యాయవాది పిటిషన్‌ వేశారు,కరోనా వలన జరపలేమని ప్రభుత్వం చెప్పగా ఆ మాట ఎన్నికల కమిషన్‌కు చెప్పాంటూ కోర్టు దానికి కూడా నోటీసు పంపించింది. నవంబరు 2న ఈ కేసు విచారణ మళ్లీ మొదయ్యేనాటికి ఏమవుతుందో చూడాల్సిందే.