తెలకపల్లి రవి: టీటీడీ తలనీలాల తగాదాలో వింతనిజాలు

తెలకపల్లి రవి: టీటీడీ తలనీలాల తగాదాలో వింతనిజాలు

 ఆంధ్ర ప్రదేశ్‌లో బిజెపి,టిడిపీ, జనసేన వారికి అనుకూలమైన కొన్ని మీడియా సంస్థలు ఏదో విధంగా తిరుపతిని వివాదల కేంద్రం చేయాలని, టిటిడిని దోషిగా పట్టుకోవాని ప్రయత్నిస్తూనే వున్నాయి. అది వారి వ్యూహం, హక్కు కూడా. గతంలో టిడిపి అధికారంలో వున్నప్పుడు వైసీపీ కూడా ఈ ప్రయత్నం చేసిన సందర్భాలు చాలా వున్నాయి, అప్పుడూ ఇప్పుడూ కూడా కోర్టుకు ఎక్కడం పరస్పరం కేసులు బనాయించుకోవడం సర్వసాధారణం. చివరకు తేలింది శూన్యం. ఇటీవలి కాలంలోనూ దీపకాంతులలో మరో మతం దేవుడి గుర్తు కనిపించదని, మేకప్‌ పూర్తి కాని అధికార మాస పత్రిక టైపులో ఆ దేవుడి పేరు అక్షరాల్లో కనిపించిందని కథనాలు రాయడం, తేలిపోవడం చూశాం. బస్‌టికెట్ల వెనక మరో మత క్షేత్రంఅడ్వర్టయిజ్‌మెంట్‌ వుండటం కూడా ఈ కోవలోదే. అన్యమత ప్రచారం పేరిట ఉద్యోగులపైన పడిన సందర్భాలు వున్నాయి. ఏదైతేనేం భక్తులు వీటిని ఖాతరు చేయకుండా తమ విశ్వాసాన్ని బట్టి ప్రశాంతతను కాపాడుతున్నారు. ఈ మధ్యన ఇలాంటి కథనాలు రాసిన పత్రికపై బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి కూడా కేసు పెట్టారు.

         గత విషయాలు అలా వుంచితే నిన్న మొన్న తనీలా వివాదం ఒకటిమొదలైంది. మిజోరం సరిహద్దు మీదుగా చైనాకు అక్రమ రవాణా అవుతున్న నూటముప్పై బస్తా తనీలాలు అస్సాంరైఫిల్స్‌ సైనికులు పట్టుకున్నారట. ఇవి తిరుపతి నుంచి వచ్చాయి గనక టిటిడి తప్పు చేసిందని ఒక మీడయాలో  దుమారం మొదలైంది. తాము ఈ  టెండర్‌ ద్వారా తలనీలాలు విక్రయించిన తర్వాత ఏమి జరిగేది తమకు తెలియదని టిటిడి సమాధానమిచ్చింది. ఆ పత్రిక పైన ఎదురు కేసు పెట్టాని ప్రభుత్వం నిర్ణయించింది, ఇదంతా మరో దండగమారి వివాదం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నదేవుడుగావున్న వెంకటేశ్వరస్వామికి తనీలాల సమర్పణలోనూ సాటి లేదు. దశాబ్దాలుగా ఈ తనీలాలు ఎటు వెళుతున్నాయో తెలిస్తే ఈ వ్యర్త వివాదాలకు ఆస్కారమే వుండదు. 2011లో ఒక వ్యాసం కోసం ఆ సమాచారం కొంత సేకరించాను, తిరుపతి దేవుడి తలనీలాల సమర్పణ యాగం ఈ నాటిది కాదు. నిజానికి శిఖ పర్యంతం అని, శిఖామణి అని తలజుట్టును లేదా శిరోజాలను సౌందర్యానికి, గౌరవానికి సంకేతాలుగా పరిగణించడం సర్వసాధారణం. మహా భారతం నాటికే  డజన్ల రకాల కేశాంకరణలు వున్నట్టు విరాట పర్వం చెబుతుంది. అలాంటి నేలలో ఏపుగా పెంచుకున్న జుట్టును ఏకంగా ఇచ్చేయడం కొన్ని తరాలుగా కొనసాగుతున్న విశ్వాసం. ఈ తిరుక్షవరానికి వారూ వీరని తేడాలేదు. అందాల తారల నుంచి అతి సామాన్యుల వరకూ అదే అర్పణం చేసేస్తారు. 1976లో మిస్‌ ఇండియాగా ఎన్నికైన ప్రముఖ ఈత క్రీడాకారిణి నసీఫా అలీ కూడా తన శిరోజాలను ఇచ్చేయడం మీడియాకు పెద్ద వార్త అయింది. 12 ఏళ్ల కిందటి మొక్కును తీర్చుకోవడం కోసం ఈ పని చేసినట్టు ఆమె అప్పట్లో చెప్పారు.

     ‘‘ అయితే  భక్తి పూర్వకంగా తాను సమర్పించిన తలనీలాల గోతాముల్లో కట్టి వ్యాపార సంతకు తరలిస్తారని ఆమెకు తెలిసి వుండదు అని ఈ వార్త రాసిన స్వప్న మజుందార్‌ వ్యాఖ్య! తర్వాత ఏం జరిగినా అప్పటికి అది భక్తి. భారతీయ మహిళ కేశాలు చాలా పొడుగ్గా వుంటాయి గనక వాటికి హాలివుడ్‌లో ప్రత్యేకమైన గిరాకి అట. పురుష భక్తుల జుట్టును ప్రొటీన్‌ తీసేందుకు ఉపయోగిస్తే మహిళ మాజీ జడలను మాత్రం విదేశాలకు తరలిస్తారు. వాటిని చిక్కు తీసి షాంపూలతో శుభ్రం చేసి దువ్వి ఆరబెడతారు. వంకీ జుట్టుకు మరింత గిరాకి. ఏటా సుమారు కోటి 36 లక్ష టన్ను శిరోజాలు ఓడకెక్కించి విదేశాకు పంపిస్తారు. మనకన్నా ఎక్కువ జనాభా గల చైనీయు జుట్టుతో మన జుట్టు ఎంచక్కా కలిసి పోతుందట. అందుకే వారు ప్రత్యేకంగా మన కేశ సంపద రావించి తమ వెంట్రుకలు కూడా కలిపి విగ్గు సవరాలు తయారు చేసి పాశ్చాత్య దేశాలకు పంపి కురుల సిరుల పంట పండించుకుంటారు.
          చైనా మన జుట్టుకు అది పెద్ద దిగుమతి దారే గాని వేరే వేరే చోట్లకు కూడా వెళుతున్నట్టు చెప్పారు కేశ ఎగుమతి విభాగాన్ని చూసే ప్రాంతీయ డైరెక్టర్‌ సుందర పాండ్యన్‌. అమెరికాకు కూడా మన జుట్టు ఎగుమతు ముప్పై శాతం పెరిగాయట. ఐరోపా దేశాలు తెప్పించుకుంటున్నాయట. అమెరికాలోనైతే ఒక జడ కుచ్చుకు ఒకటిన్నర డాలరు ఇచ్చి కొన్నాక చివరకు విగ్గును 1500 డార్లకు అమ్మేసుకుంటారట!
      1960  తర్వాత రాకపోకల ప్రచారాలు పెరిగే కొద్ది నీలాల సమర్పణ కూడా జోరందుకుంది. ఏటా దాదాపు కోటి న్నర మంది తిరుక్షవరం చేయించుకుని వెళుతున్నట్టు అంచనా.. ఈ కేశ సంపదను ఎగుమతి చేసి పంపక పోతే టిటిడి ఏం చేస్తుంది? అసలు దేవుడికి కొట్టే కొబ్బరి చిప్పు వస్త్రాల కానుకులు అన్నీ కూడా వేలం వేస్తారు కదా... కనకదుర్గ చీర వేలం విజయవాడలో నిరంతర వ్యవహారం.  ఒకసారి పద్దతి ప్రకారం వేలం వేసి విక్రయించిన తర్వాత ఏం జరిగేది ఎవరు చెప్పగరు? అపవిత్రం చేయకూడదని చెప్పగలరు గాని నిరంతరం నిఘా వేసి చూడగలరా? ఇప్పుడు అక్రమ రవాణా జరుగుతున్న కేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలి కదా. ఈ లోగానే భక్తి విశ్వాసాల సమస్యగా చేయడమెందుకు? చైనాకు వెళ్లడంపై కొందరు సెంటిమెంట్లు తీసుకురావడమెందుకు? అక్రమ రవాణా ఎవరు చేసినా తప్పే గాని ఆధ్యాత్మిక విషయాలను రాజకీయ అస్త్రంగా వాడుకోవడం కూడా తప్పే! తనీలాల తగాదా ఎలా ముదిరేది చూద్దాం మరి.