తెలకపల్లి రవి : స్థానిక నోటిఫికేషన్ల నిలిపివేతలో గుణపాఠాలు, రేపటి సంకేతాలు..

తెలకపల్లి రవి : స్థానిక నోటిఫికేషన్ల నిలిపివేతలో గుణపాఠాలు, రేపటి సంకేతాలు..

 ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఏక పక్షంగా ప్రకటించిన స్థానిక ఎన్నిక  నోటిఫికేషన్ లను హైకోర్టు సస్పెండ్‌ చేయడం  అనివార్యమే గాక అవసరం కూడా. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోలవాని సుప్రీం కోర్టు మొదటే చెప్పింది. ముగ్గురు అధికారులు ఎన్నికల కమిషనర్‌ ను కలుసుకోవాలనీ, కరోనా పరిస్థితి తీవ్రంగా వుందనేది కూడా వాస్తవమని ఇటీవల హైకోర్టు ఆదేశాలో చెప్పింది. కాని ఆ విధమైన సమగ్ర సమీక్ష గాని, సంప్రదింపులు  ఒప్పించడం గాని లేకుండా ఎస్‌ఇసి నిర్ణయం ప్రకటించారు. వాస్తవానికి ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, పంచాయితీ రాజ్‌ కార్యదర్శి గోపాకృష్ణ ద్వివేదీ,ఆరోగ్య శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సగౌరవంగా కలసి మాట్లాడారు.

కరోనా వాక్సినేషన్‌ కార్యక్రమం కారణంగా ప్రభుత్వ సిబ్బంది అందులో తలమునకలై వుంటారని వారు నివేదించారు. ఇప్పుడు ఎన్నిక నిర్వహణ సాధ్యం కాదని తమ అంచనాగా చెప్పారు. అయితే వారు తిరిగి వచ్చాక  కొద్ది సేపటిలోనే నిమ్మగడ్డ ఎన్నికు జరపాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. వారి అభిప్రాయాలు తోసిపుచ్చుతూ లేఖ రాశారు. ఆ పైన నోటిఫికేషన్‌కు వెళ్లారు. ఏది ఏమైనా ఎన్నికలు జరిపి తీరాలని లేదంటే నోటిఫికేషన్‌తో మరో సంఘర్షణ వాతావరణం సృష్టించాని ఆయన మొండిగా వున్నట్టు తేలిపోయింది. ఇంతలోనే కోడ్‌ కూడా అమలులోకి వచ్చినట్టు ప్రకటించారు.

రాజ్యాంగం 243కె ప్రకారం స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యత కమిషనర్‌ దే గనక ఆయన నిర్ణయమే అంతిమమని టిడిపి నేతలు బలపర్చారు. కాంగ్రెస్‌ ఇది ఏక పక్ష వైఖరి అని విమర్శించింది, ఇక సిపిఎం ప్రభుత్వం ఎస్‌ఇసి మధ్య సమన్వయం వుండాలని సంఘర్షణ దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. వైసీపీ నేతలు, మంత్రులు గతంలోలాగే ఇదంతా టిడిపి అధినేత ఆదేశాల మేరకు నిమ్మగడ్డ చేస్తున్నారని ఆరోపించారు. అనేక ఉద్యోగ సంఘాలు, వివిధ శాఖ సిబ్బంది, ఆఖరుకు పోలీసులు కూడా తాము ప్రాణాలు ఫణంగా పెట్టి ఎన్నిక విధులు నిర్వహించ లేమని ప్రకటించారు. ఈ విధంగా దేశంలోనే ఎన్నడూ ఎరుగని ఒక విపరీత వివాదం ఏర్పడింది.

ఈ సమయంలో చంద్రబాబు నాయుడు కేంద్ర బలగాలతో స్థానిక ఎన్నికలు జరిపించాలనీ, ముఖ్యమంత్రి ఇంటికే పరిమితం కావాలనీ  కొత్త వాదనలు తెచ్చారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అయితే గవర్నర్‌ ్జజోక్యం చేసుకోవాలన్నారు. 243(ఎ),(కె) ప్రకారం  ఎన్నిక కమిషనర్‌ దే  నిర్ణయమనీ, గవర్నర్‌ ఆయన కోరిన సిబ్బందిని సమకూర్చాలని అన్నారు.  ఇక్కడ చెప్పాల్సిందేమంటే 243  అధికరణంలో ఎ నుంచి జెడ్‌ వరకూ అనేక నిబంధనలున్నాయి. ఇవన్నీ స్థానిక సంస్థలకు సంబంధించిన అంశాలను పూర్తిగా శాసనసభ పరిధిలో వుంచాయి.  243 కె మాత్రమే ఎన్నిక నిర్వహణ మార్గదర్శకం ఎన్నిక కమిషనర్‌దని చెబుతుంది. గవర్నర్‌ తను కోరినప్పుడు సిబ్బందిని ఇవ్వాలనీ, తొలగించాలంటే శాసనసభ న్యాయమూర్తులు తొలగింపు తరహాలోనే తొలగించాలని చెబుతుంది.

ఈ నిబంధనలతో సహా మరెక్కడా సర్వాధికారాలు ఎస్‌ఇసివే అని లేదు. నోటిఫికేషన్‌ తోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం తన అదుపులోకి వస్తుందనీ లేదు, అడిగి తీసుకోవలసిందే.  గవర్నర్‌ అన్నప్పటికీ వాస్తవంలో ప్రభుత్వమే. ఇక కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలన్నది సమాఖ్య సూత్రాలకే విరుద్దం. అంతేగాక సాధారణ పరిస్థితులకు భిన్నమైన కరోనా వంటి మహమ్మారి వున్నప్పుడు ఆ కారణంగానే గతంలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఈ సారి ఎంత జాగ్రత్తగా  ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలి? సుప్రీం కోర్టు చెప్పింది కూడా అదే. అభిశంసనతో తొలగించే అవకాశం వున్నా  ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకుని నిమ్మగడ్డను తొలగించిన తప్పును దిద్దుకుని ఆయనను తిరిగి నియమించింది. 2020 మార్చిలో  ఎన్నికల వాయిదా సరైందైనా ఏకపక్షంగా ప్రకటించి ఈ సంఘర్షణకు అంకురార్పణ చేసిన  నిమ్మగడ్డ తనను తొలగించిన తరుణంలోనూ పునర్నిర్మాణ తీర్పు అమలుకు అనుసరించిన పద్ధతి కోర్టు విమర్శకు గురైంది.

ఇరు పక్షాలు గతంలో తప్పు దిద్దుకుని సమన్వయంతో వ్యవహరించి వుండాల్సింది. నిమ్మగడ్డ వుండగా ఎన్నికలు జరపబోమని మంత్రులు అన్నప్పటికీ ప్రభుత్వం అధికారులను పంపి కోర్టు ఆదేశాన్నిఅమలు చేసింది. కాని వారి అభిప్రాయాలను గానీ, కరోనా వాక్సిన్‌ కోసం దేశమంతటా సాగుతున్న సన్నాహాను గాని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నిక  కమిషనర్‌ తను అనుకున్నదే అమలు చేయడానికి సిద్ధమవడం మళ్లీ వివాద సృష్టించింది. గతంలో వాయిదా వేసినప్పటిలాగే ఇప్పుడు నిర్వహణ నోటిఫికేషన్‌ విషయంలోనూ వ్యవహరించారన్న మాట. అందుకే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లవసి వచ్చింది. హకోర్టు న్యాయమూర్తి కూడా నోటిఫికేషన్‌ను పక్కనపెట్టేశారు. ఇప్పుడు జరగాల్సింది సంప్రదింపు క్రమం, కరోనా నివారణ చర్యులు  తప్ప సాగదీసుకోవడం కాదు. కాని హైకోర్ట్ డివిజన్‌ బెంచిలోనూ  నిమ్మగడ్డ  అభీష్టం నెరవేరలేదు, వారం రోజులు వాయిదా వేయడమే గాక తక్షణ విచారణ అవసరం లేదని డివిజన్‌ బెంచి స్పష్టంగా చెప్పింది.  అప్పటికి సెలువు ముగిసి మామూలు కోర్టులోనే విచారణ జరుగుతుంది. అప్పుడు కూడా అవసరమైతే  ఇరుపక్షాలో ఎవరైనా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లడం అనివార్యం.

పశ్చిమ బెంగాల్‌ స్థానిక ఎన్నిక ప్రక్రియలో జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించిందనీ, ఎపిలోనూ అలాగే చేస్తే తను అనుకున్నట్టు చేయొచ్చని  కమిషనర్‌ భావిస్తుండవచ్చు అంతేగాక ఈ తీర్పు వచ్చేలోగానే తన తర్వాత స్తానంలో వున్న జాయింట్‌ డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ ను తొగిస్తూ ఉత్తర్వులిచ్చారు. తర్వాత కమిషన్‌ కార్యదర్శి వాణీ మోహనరావు ను వెనక్కు పంపారు. ఉద్యోగుకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు చేశారు. ఇవన్నీ రాజకీయ ఫక్కీలో వున్న చర్యలు తప్ప రాజ్యాంగ సంస్థలు చేసేవి కావు.ఆరోగ్య భద్రత అనే ప్రాతిపదిక మీద హైకోర్ట్ ఉత్తర్వునిచ్చింది. ఆ విషయంలో కొత్త పరిణామాలేవీ జరగలేదు గనక నిమ్మగడ్డ అదనంగా వాదించేది వుండదు. ఇక రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ ఒప్పుకో దు. కనక స్థానిక ఎన్నిక సంక్షోభం కొనసాగవచ్చు గాని ఫలితం వుండదు.

అసలు కోర్టు తీర్పు తర్వాత మళ్లీ నియమితుడైన నిమ్మగడ్డ నిబంధన రీత్యా తన విజయాన్ని ప్రకటించుకుని రాజీనామా చేసి వుంటే బావుండేదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఒక ఐఎఎస్‌ అధికారి నాతో అన్నారు.  ఈ  కొత్త మలుపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అబిశంసన ప్రక్రియ కూడా చేపట్టవచ్చు. ఇవన్నీ సుప్రీం కోర్టు  ఘట్టం తర్వాతనే చూడాల్సివుంటుంది. కోర్టు జోక్యం చేసుకోవలసిందే గాని యనమల వంటివారు అంటున్నట్టు గవర్నర్‌ తనుగా జోక్యం చేసుకునేది వుండదు. కాని నిమ్మగడ్డ రాష్ట్రపతిని కలుసుకోవానుకుంటున్నట్టు కథనాలున్నాయి. వారి స్పందన కూడా చూడవలసిందే. ఇప్పటి కైనా ఈ వివాదంపెంచుకోవడానికి బదులు సంయమనంతో వ్యవహరించవసిన బాధ్యత అందరిపైనా వుంది.