తెలకపల్లి రవి : బీహార్ ఫలితాలు బీజేపీకి సంబరం.. వ్యతిరేకులకు స్థైర్యం

తెలకపల్లి రవి : బీహార్ ఫలితాలు బీజేపీకి సంబరం.. వ్యతిరేకులకు స్థైర్యం

బిజెపి కేంద్ర కార్యాయంలో  బీహార్‌ విజయోత్సవంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మంచి పాలన అంటే తమ పార్టీని ప్రజలు తల్చుకునే దశ వచ్చిందన్నారు. రెండు గదల ఇంటితో బయలుదేరిన తాము ఈ రోజు దేశమంతా ఎక్కడ చూసినా పాలన చేస్తున్నామని ప్రకటించారు. దేశం నలుమూలలా బిజెపినే పాలిస్తున్నట్టు కలిగిన అభిప్రాయాన్ని ఈ మాటతో ప్రధాని ధృవీకరించారు. నిజంగానే బీహార్‌ విజయమూ,  వివిధ రాష్ట్రాలో ఉప ఎన్నిక ఫలితాు బిజెపికి అమితానందం కలిగించేవిగా వున్నాయి. ఇవి కరోనాను  ఎదుర్కోవడంలో తమ విధానానికి   ఆమోదముద్రగానూ వ్యక్తిగత విజయంగానూ మోడీ చెబుతున్నారు.

అయితే అది పూర్తి నిజమా అంటే పాక్షిక సత్యమే. ఎందుకంటే బీహార్‌లోనే బిజెపి విజయం బొటాబొటిగా లభించింది. అందులోనూ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ స్వంత పార్టీ అయిన జెడియు బలం గణనీయంగా తగ్గిపోయింది. పదిమంది మంత్రులు ఓడిపోయారు. నితిశ్‌ కుమార్‌ నాలుగోసారి ముఖ్యమంత్రిగా రానుండటం అసాధారణమే గాని పూర్తిగా బిజెపిపై ఆధారపడి పాలించలవసి వుంటుంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంఎల్‌ఎ మనోహర్‌ ఈ విషయమై బహిరంగంగానే చీదరించుకున్నారు. పెద్ద పార్టీగా వచ్చిన తేజస్వియాదవ్‌ ఆర్జేడీని బలపర్చవలసిందిగా కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌సింగ్‌ మరో పిలుపునిచ్చారు.

ఇవేవీ జరగవు గాని  నితిష్‌ కుమార్‌ తిరస్కరణకు గురైనారనేది కనిపించే సత్యం. జూనియర్‌ భాగస్వామిగా వుంటూనే బిజెపి దయతో ఆయన ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టాలి. అంతకు ముందు ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా పోటీపడిన నితిశ్‌ ఇప్పుడు ప్రత్యేకంగా ఆయనకే ధన్యవాదాలు చెప్పడం ఇందులో తొలి అంకం మాత్రమే. ఎన్నికల ప్రచారంలోనే అడుగడుగునా మోడీనే ముందుకు తెచ్చినట్టు గతంలో చెప్పుకున్నాం, ఆ మోడీ ప్రచారంలో పాకిస్తాన్‌ చైనా అయోధ్య వంటి సమస్యలతో ఉద్వేగం పెంచే ప్రయత్నం చేశారు తప్ప బీహార్‌ వెనకబాటు దేశంలో జాతీయ సగటు 23 శాతంకన్నా రెట్టింపు 46 శాతం వున్న నిరుద్యోగం వంటి వాటిని దాటేశారు. ఒకప్పుడు  బిజెపితో కలిసి వుంటూనే ఎన్‌ ఆర్‌ పి కి వ్యతికేకంగా తీర్మానం చేయించిన నితిశ్‌  ఇప్పుడు హిందూత్వ ఎజెండాకు తలవంచడం తప్ప చేయగలిగింది లేదని పరిశీలకులు చెబుతున్నారు.

ఎన్‌డిఎ నుంచి నిష్క్రమించిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జెపి పోటీ వలన జెడియు సీట్లు కోల్పోయిందని మరో లెక్క  చెబుతున్నారు. నితిశ్‌ ను దెబ్బ తీయడం కోసం తమ ప్రోద్బలంతోనే ఆ పార్టీ ఇదంతా చేసిందనే ఆరోపణల మధ్య బిజెపి నేతలు చిరాగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లోనూ గుజరాత్‌లోనూ కాంగ్రెస్‌ నుంచి  రాజీనామాచేసి వచ్చిన  ఎంఎల్‌ఎలలో అత్యధికలు విజయం సాధించడం బిజెపి ప్రభుత్వాలకు మరింత సుస్తిరత్వం కలిగించింది. యుపిలోనూ కాంగ్రెస్‌ ఏ మాత్రం ప్రభావం చూప లేకపోయింది. ఇది కూడా కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే జరిగిందే. ఇందుకు భిన్నంగా తేజస్వి యాదవ్‌  నాయకత్వంలోని మమాఘట్‌బంధన్‌ బీహార్‌లో పరిపాటిగా మారిన కులాల వారి ఎజెండాను మార్చే ప్రయత్నం చేసింది.

నిరుద్యోగం మొదటి సారి ప్రధానసమస్యగా తీసుకొచ్చారు. దడాయ్‌ సచాయ్‌ దవాయ్‌ గడాయ్‌ అన్న నాలుగు అంశాల  ప్రణాళిక ప్రభావశీంగా పనిచేసింది.  డబుల్‌ ఇంజన్‌ గా చెప్పుకున్న ఎన్‌డిఎను మూడు పదుల తేజస్వి నాయకత్వంలోని కూటమి శక్తివంతంగా నివారిచింది. ఓట్ల లెక్కింపులో అవకతవక వల్లనే తమకు స్తానాు తక్కువగా చూపిస్తున్నారని ఆర్జేడీ, వామపక్షాలు  గట్టిగా ఫిర్యాదు చేస్తున్నాయి. అమెరికా అద్యక్ష ఎన్నిక వాదోపవాదాలపై ఎక్కడలేని ప్రచారమిచ్చిన జాతీయ మీడియా ఈ ఫిర్యాదును తేలిగ్గా తోసేస్తున్నది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి  సునీల్‌ అరోరా ఏకపక్షంగా వాటిని తోసిపుచ్చుతున్నారు. పదకొండు స్థానాలో  తప్పు జరిగాయని ఉదహరిస్తున్నారు. హిస్లా నియోజకవర్గంలో  ఎన్‌డిఎ 12 స్థానలతో గెవడం ఇందులో భాగమే.

విజయం ఎన్‌డిఎ దైనా ఎన్నికల స్టార్‌ మాత్రం తేజస్వి అనేది బీహార్‌లో వినిపిస్తున్న మాట, ఘట్‌ బంధన్‌లో 70 స్థానాలు తీసుకుని కేవం 19 మాత్రమే గెలిచిన కాంగ్రెస్‌ ఈ పరిస్తితికి ప్రధాన బాధ్యత వహించాల్సి వుంటుందని లు తేల్చిచెబుతున్నాయి. 29 స్థానాలు మాత్రమే తీసుకుని 16 గెలిచిన వామపక్షాలు గొప్పతనం ఇంతకంటే చాలా  ఎక్కువగా వుంది. వంద స్తానాలలో వామపక్షాల మద్తతు ఎంతగానోఉపయోగపడిరదని కూడా చెబుతున్నారు. మోడీ  విధానానికి మద్దతుగా ఈ ఫలితాన్ని చెబుతున్నా ఎన్‌డిఎ 2019 ఎన్నికలతో పోలిస్తే 12 శాతం ఓట్లుకోల్పోయింది. ఆర్జేడీ సీట్లలో పెద్ద పార్టీగా రావడమే గాక 23.1 శాతంతో  ఓట్లలోనూ ముందుంటే బిజెపి 19.5 శాతానికి పరిమితమైంది. ప్రచార క్రమంలో ఘట్‌బంధన్‌ సవాల్‌ను తక్కువ చేసినజాతీయ మీడియా ఇవన్నీ  చెప్పకుండా జంగిల్‌ రాజ్‌ భయమే ఓటమికి కారణమైందని చెబుతున్నది,

మజ్లిస్‌ అయిదుస్థానాలు గెల్చుకోవడం గ్చొకోవడం మరో ముఖ్య పరిణామం. దానివలన ఘట్‌బంధన్‌కు నష్టం కగలేదని చెబుతున్నా వాతావరణంలో మార్పును ఎలా విస్మరించగలం ? మజ్లిస్‌ కంటే ఎక్కువగా మహాఘట్‌ బంధన్‌ లోనే  ముస్లిం ఎంఎల్‌ఎు ఎక్కువగా (ఎనిమిది మంది) వచ్చారు. బిఎస్‌పి తరపున గెలిచింది కూడా ముస్లిం అభ్యర్థి కావడం విశేషం. బీహార్‌లోనే గాక భవిష్యత్తులోన బెంగాల్‌ తమిళనాడు ప్రతిచోటా తాము పోటీ చేస్తామని మజ్లిస్‌ నాయకుడు ఒవైసీ అంటున్నారు. బిఎస్‌పి మజ్లిస్‌ ఓట్ల చీలికను ఎలా వుంటుందనేది స్తానిక పోటీ తీరుపై ఆధారపడి వుంటుంది.  మొత్తంపైన బీహార్‌ఎన్నికు బిజెపి  ఆర్థికవిధానాకు మతతత్వరాజకీయాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావనను బంగా ముందుకుతెచ్చాయి. ఒక వ్యాఖ్యాత అన్నట్టు  కరోనా కష్టాలను కర్మసిద్దాంతంతో సరిపెట్టుకోవడంగాక రాజకీయ సైద్ధాంతిక పోరాటంగా మారిస్తే నల్లేరుమీద బండిలా నడవకుండా ఆపవచ్చనే  విశ్వాసం కలిగించాయి.