శ్రీకాకుళంలో హైదరాబాద్ యువకులు పట్టివేత...క్వారంటైన్‌ కు తరలింపు 

శ్రీకాకుళంలో హైదరాబాద్ యువకులు పట్టివేత...క్వారంటైన్‌ కు తరలింపు 

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు యువకులను పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా... కొందరు రాష్ట్రాలు, జిల్లాలు సరిహద్దులు దాటుకుంటూ పోతున్నారు. తెలంగాణకు చెందిన ఆరుగురు ఒడిశాలోని కటక్‌ నుంచి శ్రీకాకుళం టెక్కలి చేరుకున్నారు.. అక్కడి నుంచి ఓ లారీలో హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వాళ్లు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. టెక్కలి ఐతం కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు . లాక్‌డౌన్ సమయంలో వాళ్లు ఎలా టెక్కలి చేరుకున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.