కోజికోడ్ విమాన ప్రమాదం పై స్పందించిన కోహ్లీ, సచిన్

కోజికోడ్ విమాన ప్రమాదం పై స్పందించిన కోహ్లీ, సచిన్

కేరళ‌లో నిన్న రాత్రి  కోజికోడ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19మంది మరణించినట్లుగా తెలుస్తుంది. అలాగే 123 మంది గాయపడ్డారు. నిన్న దుబాయ్ నుంచి కోజికోడ్‌‌కు వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన పై భారత క్రికెటర్లు స్పందించారు. భారత కెప్టెన్ ఈ విషయం పై ట్విట్ చేస్తూ..''కోజికోడ్‌లో విమాన ప్రమాదానికి గురైన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం'' అని కోహ్లీ తెలిపాడు. 

భారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. ''కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో రన్‌వేపై ఓవర్‌షాట్ చేసిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గాయపడినవారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని సచిన్ ట్విట్ చేసారు. 

''ఈ వార్త నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. 2020 మమ్మల్ని కనికరించు'' అని యువరాజ్ తెలిపాడు. 

''ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పైలట్ కుటుంబానికి నా సంతాపం మారియు ఎయిర్ ఇండియా విమానంలో గాయపడిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నాను'' అని ఇర్ఫాన్ పఠాన్ ట్విట్ చేసాడు.