ప్రణబ్ ముఖర్జీకి సంతాపం తెలిపిన భారత క్రికెటర్లు...

ప్రణబ్ ముఖర్జీకి సంతాపం తెలిపిన భారత క్రికెటర్లు...

చాలారోజులుగా కరోనావైరస్‌తో ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నభారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ అలాగే పలువురు ఆటగాళ్లు నివాళులు అర్పించారు. 2012 మరియు 2017 మధ్య భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పనిచేసారు.

ఈ ఘటన పై విరాట్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ''దేశం ఒక అద్భుతమైన నాయకుడిని కోల్పోయిందని ప్రణబ్ ముఖర్జీ మరణం గురించి విన్నందుకు బాధగా ఉంది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం'' అని తెలిపాడు.

సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా పోస్టులో "మాజీ అధ్యక్షుడుప్రణబ్ ముఖర్జీ మరణం గురించి విన్నందుకు చాలా బాధగా ఉంది. అనేక దశాబ్దాలుగా ఆయన భారతదేశానికి సేవ చేశారు. ఆయన కుటుంబానికి, ప్రియమైనవారికి నా సంతాపం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'' అని తెలిపాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సోషల్ మీడియాలో "రెస్ట్ ఇన్ పీస్ ప్రణబ్ ముఖర్జీ జీ. దేశానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయనకు ప్రియమైనవారికి నా సంతాపం'' అని పోస్ట్ చేసాడు.

వీరేందర్ సెహ్వాగ్ తన ట్విట్టర్లో ''ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినందుకు నా హృదయపూర్వక సంతాపం. ఓం శాంతి'' అని పోస్ట్ చేసారు.