చిన్న పిల్లల మారిన భారత ఆటగాళ్లు...

చిన్న పిల్లల మారిన భారత ఆటగాళ్లు...

ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన త‌ర్వాత ఇండియ‌న్ టీమ్ క్రికెట‌ర్లు చిన్న పిల్ల‌ల్లా మారిపోయారు. కిడ్స్ జోన్‌లోకి వెళ్లి స‌ర‌దాగా ఎంజాయ్ చేశారు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోసం టీమ్‌తో చేరిన శిఖ‌ర్ ధావ‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూస్తే.. మ‌న క్రికెట‌ర్లు మ్యాచ్ త‌ర్వాత ఎలాంటి మూడ్‌లో ఉన్నారో అర్థ‌మ‌వుతుంది. అందులో ధావ‌న్‌తోపాటు రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, కుల్‌దీప్ యాద‌వ్ కూడా ఉన్నారు. పిల్ల‌లు ఆడుకునే జోన్‌లోకి వెళ్లి అక్క‌డి మూడు చ‌క్రాల సైకిల్‌పై తిరుగుతూ, బాల్స్‌తో ఒక‌రినికొరు కొట్టుకుంటూ క్రికెట‌ర్లు స‌ర‌దాగా గ‌డిపారు. జీవితంలో ఎంత పెద్ద‌గా అయినా చిన్న‌త‌నం మాత్రం పోకూడ‌దని.. ప‌ని ఎంత ముఖ్య‌మైనా కూడా ఇలాంటి మ‌స్తీ కూడా అవ‌స‌ర‌మే అని ధావ‌న్ కామెంట్ చేశాడు. ఈ పిల్ల‌లు చేస్తున్న మ‌స్తీని నేను రూమ్‌లో నుంచి చూశాను అంటూ స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ ఈ వీడియోకు కామెంట్ చేశారు. ఐదు టీ20 మ్యాచ్‌లు కూడా అహ్మ‌దాబాద్‌లోనే జ‌ర‌గ‌నున్నాయి.