చివరి టెస్టుతో 550 టెస్టులు పూర్తిచేసుకున్న టీంఇండియా...

చివరి టెస్టుతో 550 టెస్టులు పూర్తిచేసుకున్న టీంఇండియా...

టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మ్యాచ్‌తో... ఇప్పటి వరకూ టీమిండియా ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య 550కి చేరింది. అంతే కాదు, 2012 తర్వాత టీమిండియా.. స్వదేశంలో ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. దీంతో, ఈ రోజు ప్రారంభమయ్యే మ్యాచ్‌ ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఇక ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 30/2 తో నిలిచింది. భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ ఓపెనర్లను పెవిలియన్ కు చేర్చాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే...భారత్ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కు వెళ్లాలంటే ఈ టెస్టులో విజయం అయిన సాధించాలి లేదా డ్రా అయిన చేసుకోవాలి. కానీ ఓడిపోకూడదు. ఒకవేళ ఓడిపోతే ఫైనల్ కు ఆసీస్ వెళ్తుంది