2019లో విజయం మాదే

2019లో విజయం మాదే

చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలలో నమ్మకం పెరిగింది... 2019 ఎన్నికలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే విజయం సాధించి... అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... చిలకలూరిపేట పురపాలక సంఘం కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేసిన మంత్రి... ఈ సందర్భంగా మాట్లాడుతూ... వెనుకబడిన కులాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు రూ 21.60 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు. మరోవైపు 26 మసీదుల మరమ్మతుల నిమిత్తం ఒక్కో మసీదుకు రూ. 20 వేల చొప్పున రూ. 5.20 లక్షలు పంపిణీ చేశామన్నారు పుల్లారావు. పేద ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి ధృడసంకల్పంతో పనిచేస్తున్నారని వెల్లడించారు మంత్రి ప్రత్తిపాటి... ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా... అంగన్ వాడీలకు, హోంగార్డులకు, వీఆర్ఏలకు జీతాలు పెంచామన్నారు.