హుజూర్‌నగర్‌ బరిలో టీడీపీ.. నేడే అభ్యర్థి ప్రకటన..

హుజూర్‌నగర్‌ బరిలో టీడీపీ.. నేడే అభ్యర్థి ప్రకటన..

తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు హుజూర్‌నగర్ చుట్టూ తిరుగుతోంది.. ప్రధానంగా కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని భావిస్తుండగా.. టీడీపీ.. మరికొన్ని పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాయని అంచనాలు వేసినా.. అనూహ్యంగా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపాలనే నిర్ణయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాల పార్టీ తరపున అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. హుజూర్‌నగర్‌లో పోటీచేయాల్సిందేనంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలంతో పట్టుబడడంతో చివరకు పోటీచేయాలని నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఇవాళ అభ్యర్థిని ప్రకటించే.. రేపే అభ్యర్థితో నామినేషన్ దాఖలు చేయించాలనే ఆలోచనలు ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి.. బీజేపీ నుంచి కోట రామారావు బరిలోకి దిగారు.. అక్టోబరు 21వ తేదీన హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక, నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది.. ప్రధాన పార్టీలో మండలాల వారీగా ఇంఛార్జ్‌లను నియమించి విస్తృతంగా ప్రచారం చేసేలా ప్లాన్‌ చేస్తున్నాయి.