ఓటమి భయంతోనే వైసీపీ వెనకడుగు...
రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి మధ్య స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ముదురుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆసక్తి చూపుతుండగా, దానిని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కరోనా వ్యాప్తి తగ్గలేదని, గ్రామీణ ప్రాంతాల్లో కేసుల ఉధృతి తగ్గలేదని సీఎస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి లేఖ రాశారు. ఇక ఇదిలా ఉంటె, స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతో వైసీపీ వెనక్కి తగ్గుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల ఆరోపించారు. దమ్ముంటే ఫిబ్రవరిలో ఎన్నికలకు వైసీపీ సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు జరిగాయని, ఆ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహించారని, కానీ వైసీపీ ఎందుకు వెనక్కి తగ్గుతుందో చెప్పాలని అయన డిమాండ్ చేశారు. మైనారిటీల్లో ఉన్న వ్యతిరేకతను చూసి వైసీపీ వెనక్కి తగ్గుతోందని యనమల ఆరోపించారు. ఇక స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా సీఎస్ ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. గవర్నర్ కూడా స్థానిక ఎన్నికలకు సహకరించాలని యనమల విజ్ఞప్తి చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)