టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్... ఆందోళనలో కార్యకర్తలు 

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్... ఆందోళనలో కార్యకర్తలు 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈరోజు తెల్లవారుజామున గుంటూరు జిల్లాలోని చింతలపూడిలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ముందస్తు సమాచారం లేకుండానే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తీసుకెళ్లడంతో జిల్లాలో గందరగోళం నెలకొన్నది.  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.  రాజధాని భూముల విషయంలో ఆయన్ను అదుపులోకి తీసుకొని ఉండొచ్చని ప్రచారం జరుగుతున్నది.  అయితే, పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారు అన్నది తెలియాల్సి ఉన్నది.