ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు... రేపే విచారణ... 

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు... రేపే విచారణ... 

ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు టీడీపీ సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిన్నటి వరకు గుంటూరు జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.  నిన్నటి రోజున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా ఆయన్ను అధికారులు మరోమారు ప్రశ్నించి అక్కడి నుంచి  విజయవాడ సబ్ జైలుకు తరలించారు. 

తన ఆరోగ్యం బాగాలేదని, విచారకు ఎప్పుడు హాజరు కావాలని ఆదేశిస్తే అప్పుడు తప్పకుండా హాజరు అవుతారని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడు తరపు లాయర్లు వాదించారు.   వాదనలు విన్న ఏసీబీ కోర్టు బెయిల్ కు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసింది.  జూన్ 3 వ తేదీన దీనికి సంబంధించి తీర్పు వెలువరించబోతున్నది.  అయితే, ఈరోజు అచ్చెన్నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  తనను ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేశారు.  అచ్చెన్నాయుడు లంచ్ మోహన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ జరపబోతున్నది.  హైకోర్టులో అచ్చెన్నాయుడికి ఊరట లభిస్తుందా? ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా ? చూడాలి.