టీడీపీ ప్రకటించిన పూర్తి స్థాయి కమిటీలు..ఎవరెవరికి స్థానం దక్కాయంటే ..!

టీడీపీ ప్రకటించిన పూర్తి స్థాయి కమిటీలు..ఎవరెవరికి స్థానం దక్కాయంటే ..!


తెలుగుదేశం అధినేత చంద్రబాబు టిడిపి జాతీయ కమిటీతో పాటు తెలంగాణ కమిటీని ప్రకటించారు. తెలంగాణ అద్యక్షునిగా ఎల్ రమణనే కొనసాగించిన చంద్రబాబు.....ఏపీ అధ్యక్షునిగా అచ్చెన్నాయుడుకి బాధ్యతలు అప్పగించారు. గతకొంత కాలంగా అచ్చెన్న పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ నేడు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. వీరితో పాటు 25 మందితో పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేశారు. బాలకృష్ణను పొలిట్ బ్యూరోలో కి తీసుకున్న అధినేత.....ఆరుగురు వైస్ ప్రెసిడెంట్లలో ముగ్గురు మహిళలనే నియమించారు. 

ఇక టీడీపీ జాతీయ కమిటీలో మొత్తం 27 మందికి అవకాశం ఇచ్చారు. దీనితోపాటు ఇచ్చిన తెలంగాణ కమిటీలో మళ్లీ ఎల్ రమణను అద్యక్షుడిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రమణను తప్పించాలని కొందరు నేతలు సూచనలు చేసినా... చంద్రబాబు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ పార్టీలో మాజీ మంత్రిగా, మాజీ ఎంపిగా ఉన్నది ఎల్ రమణ ఒక్కరే కావడంతో అయననే కొనసాగించాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. 31 మందితో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేసిన బాబు. ఆరుగురు నేతలతో తెలంగాణ తెలుగుదేశం కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు.
 

ఏపీటీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. రెండు రాష్ట్రాలకు చెందిన 25 మందితో పోలిట్ బ్యూరో ను ఏర్పాటు చేశారు. కొత్తగా బాలకృష్ణకు ఈ సారి పొలిట్ బ్యూరోలోకి అవకాశం ఇచ్చారు. జాతీయప్రధాన  కార్యదర్శి హోదాలో లోకేష్, రాష్ట్ర అద్యక్షులుగా అచ్చెన్నాయుడు, ఎల్ రమణ పొలిట్ బ్యూరోలో ఉంటారు. ఇక పోతే బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా, శ్రీనివాసుల రెడ్డి, పితాని, కొల్లు, నక్కా అనిత, సంద్యారాని లను కూడా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. రాష్ట్ర అద్యక్షునిగా పని చేసిన కళా వెంకట్రావును కూడా పొలిట్ బ్యూరోకి తీసుకుంటూ అధినేత నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్లమెంట్ అద్యక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి, సంద్యారాణి లకు కూడా పొలిట్ బ్యూరో స్థానం కల్పించారు. 

టిడిపి మూడు కమిటీలపై స్పష్టత ఇచ్చిన చంద్రబాబు.... ఏపీటీడీపీ పూర్తి కమిటీని మాత్రం ప్రకటించలేదు. మరో వారంలో ఈ కమిటీపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్ర అద్యక్షునిగా అచ్చెన్నాయుడును ప్రకటించిన చంద్రబాబు... పూర్తిస్థాయి కమిటీ ప్రకటనను పెండింగ్ పెట్టారు. ఇకపోతే జాతయ ప్రధాన కార్యదర్శిగా కంబంపాటి రామ్మోహన్‌ను తీసుకున్న అధినేత... ఆయనకు నేషనల్ పొలిటికల్ ఎఫైర్స్ బాద్యతలు అప్పగించారు. దీపక్ రెడ్డి, పట్టాబిలకు జాతీయ అధికార ప్రతినిధులుగా అవకాశం ఇచ్చారు.