అవిశ్వాసం నెగ్గుతామనే విశ్వాసం ఉంది...

అవిశ్వాసం నెగ్గుతామనే విశ్వాసం ఉంది...

కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతామనే విశ్వాసం ఉందన్నారు తెలుగుదేశం పార్టీ విప్ కొనకళ్ల నారాయణ రావు... అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశామన్న కొనకళ్ల... మేం కలిసిన అన్ని పార్టీల నేతలు మాకు మద్దతు ఇస్తున్నారన్నారు. అంతే కాకుండా, భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఎంపీలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారని తెలిపిన కొనకళ్ల నారాయణ... వారి మద్దతు కూడా మాకు లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గెలుపు మాదే... సభను వేదికగా చేసుకుని కేంద్ర వైఖరిని దేశ ప్రజలకు తెలియజేస్తామని... ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరాలతో సహా వెల్లడిస్తామన్నారు.