'తెలంగాణ పోలీసులకు ఆ అధికారం లేదు..!'

'తెలంగాణ పోలీసులకు ఆ అధికారం లేదు..!'

డేటా చోరీపై తెలంగాణ పోలీసులకు కేసు నమోదు చేసే అధికారం లేదన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల... డేటా చోరీపై గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. నేరం ఎక్కడ జరిగితే అక్కడ విచారణ జరగాలి.. కానీ, డేటా సీజ్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ఓటర్ గా వున్న వ్యక్తితో ఫిర్యాదు చేయించి దాడులు చేస్తున్న దురుద్దేశాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేసిన కనకమేడల.. లోకేశ్వర్ రెడ్డి హైదరాబాద్ ఓటరు అని గుర్తుచేశారు. పేద ప్రజల అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ కుట్రజరుగుతుందని ఆరోపించిన ఆయన.. మూడు రాష్ట్రాలలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే జోక్యం చేసుకోవడం కుట్రలో పెద్దభాగం అన్నారు.