ఆమంచిపై పోతుల సునీత తీవ్రవ్యాఖ్యలు..

ఆమంచిపై పోతుల సునీత తీవ్రవ్యాఖ్యలు..

చీరాలలో రాజకీయ పరిస్థితులు హీటు పెంచుతున్నాయి. టీడీపీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. వైపీపీలో చేరితే.. మరోవైపు చీరాల టికెట్‌పై కన్నేసిన నేతలు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓవైపు కరుణం బలరాంకు అనుకూలంగా ఫ్లెక్సీలు వెలిస్తే... మరోవైపు ఎమ్మెల్సీ పోతుల సునీత.. చీరాలలో హల్‌చల్ చేశారు. గత కొంతకాలంగా చీరాలకు దూరంగా ఉంటున పోతుల సునీత... ఇవాళ ఆమంచి వైసీపీలో చేరిన తర్వాత చీరాలకు వచ్చారు. తన అనుచరులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమంచి కృష్ణమోహన్.. తెలుగుదేశం పార్జీనీ వీడడం చాలా శుభపరిణామంగా అభివర్ణించారు. ఆమంచి అసలైన టీడీపీ కార్యకర్తల పై ఉక్కుపాదం మోపారని విమర్శించిన పోతుల సునీత... ఆమంచి టీడీపీని వీడడంతో నియోజకవర్గానికి పట్టిన దరిద్రం పోయిందని వ్యాఖ్యానించారు.