ఏపీ శాసనమండలిలో రభస... మంత్రుల తీరుపై మండిపడుతున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళం నెలకొన్నది. మండలిలో మంత్రుల తీరుపై టిడిపి ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. టిడిపి ఎమ్మెల్సీలపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. చెప్పుతో కొడతామంటూ అధికారపక్షం బెదిరిస్తోందని అన్నారు. మంత్రులు మండలికి సమాధానాలు ఇవ్వడానికి రావాలిగాని, తన్నాడు వస్తారా అంటూ టిడిపి ఎమ్మెల్సీ ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం స్పందించారు. రికార్డులు చూసి చర్యలు తీసుకుంటామని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీల తీరుపై అటు మంత్రుసైతం మండిపడ్డారు. మంత్రులను రౌడీలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా సంబోధిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులను కంట్రోల్ పెట్టకపోవడం సమంజసం కాదని మంత్రి బొత్స అన్నారు. మంత్రులకు, అధికార పక్ష సభ్యులకు అవకాశం ఇవ్వరా అని మంత్రి బొత్స ప్రశ్నించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)