మూడో రోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

 మూడో రోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కూడా రసాభాసగా మారాయి. చంద్రబాబుకు మైక్ ఇవ్వాలని పట్టుబట్టడంతో పాటు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగానికి అడ్డుపడడంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్, దీంతో వరుసగా మూడో రోజు కూడా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినట్లు అయింది. వీరిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు. చంద్రబాబు మినహా తొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు. అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది,  పోలవరం అంశం మీద జగన్ ప్రసంగిస్తూ ఉంటే దానికి అడ్డుపడుతున్నారని కారణంగా వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వివరించారు. ఇక ఈరోజు అంత ఏపీ అసెంబ్లీలో పోలవరంకు సంబంధించి వాడి వేడి చర్చ సాగుతోంది.