ఏపీ అసెంబ్లీలో రగడ..బాబు మినహా మిగతా అందరూ సస్పెన్షన్ !

ఏపీ అసెంబ్లీలో రగడ..బాబు మినహా మిగతా అందరూ సస్పెన్షన్ !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు టిడ్కో ఇళ్ళకు సంబంధించిన చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఈ చర్చ రసాభాసకు దారితీసింది. అసలు ఏం చెప్పాలనుకున్నారో చంద్రబాబుకు క్లారిటీ లేదని జగన్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్స్ మీద టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు మినహా టిడిపి సభ్యులందరినీ ఈరోజు సభ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మినహా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి అయిన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా ఆ తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. దీంతో ఈ రోజు సభ ముగిసే వరకు చంద్రబాబు మినహా మిగతా టిడిపి సభ్యులందరికీ సస్పెండ్ చేసినట్లు అయింది.